Friday, December 27, 2024

అదే సెంటిమెంట్

- Advertisement -
- Advertisement -

మూడోసారి హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

ప్రతిపక్షాలకు దడ పుట్టిస్తున్న గులాబీ సభ

హాజరుకానున్న లక్ష మంది

హుస్నాబాద్ గులాబీమయం
గతంలో రెండు పర్యాయాలు విజయం
హ్యాట్రిక్ దిశగా అడుగులు

మన తెలంగాణ/హుస్నాబాద్: బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ 2014, 2018లోనూ అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని హుస్నాబాద్ నుండి పూరించి రాష్ట్రంలో అధికారం చేపట్టడం తెలిసిందే. 2018 ఎన్నికలప్పుడు హుస్నాబాద్‌లో సిఎం కెసిఆర్ హాజరైన ప్రజా ఆశీర్వాద సభ పెద్ద ఎత్తున విజయవంతం కావడం తోపాటు అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలు సంపాదించింది. అలాగే ఈసారి 2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీఆర్‌ఎస్ పార్టీ 100 కు పైగా స్థానాలు కైవసం చేసుకుని మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే ఆశాభావాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. కాగా సిఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు తనయుడు వొడితల సతీష్ కు మార్ ఎంఎల్‌ఎగా ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నుండే గతంలో మాదిరిగానే 2023 అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలను అందజేసిన అనంతరం హుస్నాబాద్‌లో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. ఒకవైపు ఎన్నికల షె డ్యూల్ రావడం మరోవైపు కెసిఆర్ పర్యటన ప్రకటించడంతో హుస్నాబాద్‌లో సందడి నెలకొంది. హుస్నాబాద్ అంటే కెసిఆర్‌కు సెంటిమెంట్.. ప్రాంత ప్రజలపై నమ్మ కం. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ రానుండడంతో అందరి దృష్టి హుస్నాబాద్ వైపు మళ్లింది గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. గడచిన పదేళ్లలో బిఆర్‌ఎస్ పాలనలో సిఎం కెసిఆర్ నాయకత్వంలో మంత్రులు కెటిఆర్, హరీష్ రావుల నాయకత్వంలో ఎంఎల్‌ఎ వొడితల సతీష్ కుమా ర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా వేలాది కుటుంబాలకు పథకాల ద్వారా లభ్ది చేకూరింది.
సభకు సర్వం సిద్ధం: సిఎం పర్యటనతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
తొలి ప్రచార సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు గులాబీ సైన్యాలు కదం తొక్కుతున్నాయి. ఉద్యమం ప్రారంభం నుండి హుస్నాబాద్ గులాబీ పార్టీకి కంచుకోటలా ఉంది. మొదటి నుండి బలమైన నిర్మాణం బిఆర్‌ఎస్ పార్టీకి ఉంది. దాదాపు 60 వేల మంది బిఆర్‌ఎస్ పార్టీ క్రియాశీల సాధారణ కార్యకర్తలు ఉన్నారు. లక్ష యాభై వేలకు పైగా వివిధ ప్రభుత్వ పథకాలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారు. అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ తన అధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. నియోజకవర్గంలో 90 శాతానికిపైగా బిఆర్‌ఎస్ పార్టీ ప్ర జాప్రతినిధులు ఉండడం గమనార్హం. ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించి మూడోసారి హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నారు. సిఎం కెసిఆర్ సభ గులాబీ పార్టీలో మంచి జోష్ నింపడం తోపాటు ప్రతిపక్షాలలో దడ పుట్టించనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ వర్గాల్లో సిఎం పర్యటన ఉత్కంఠ రేపుతోంది.
గులాబీ జోరుతో ప్రతిపక్షాల బేజారు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హుస్నాబాద్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంఎల్‌ఎ వొడితల సతీష్‌కుమార్ నాయకత్వంలో ప్రచారంలో బిఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోతోంది. కానీ కాంగ్రెస్, బిజెపిల నుండి ఎవరు అభ్యర్థులుగా పోటీ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే బిఆర్‌ఎస్ ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు నియోజకవర్గంలో ప్రచార సభలు నిర్వహించారు. నేడు సిఎం బహిరంగ సభ ఆదివారం జరగనుండగా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గ్రామగ్రామాన ఎన్నికల ప్రచారం మరిం త ఉధృతం చేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. సిఎం కెసిఆర్ సభతో గులాబీ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తోందన్న సంకేతాలు ఇటు ప్రత్యర్థులకు అటు ప్రజలకు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.
సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎంఎల్‌ఎ వొడితల
హుస్నాబాద్ పట్టణ సమీపంలో కరీంనగర్ రోడ్డులో విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన గత రెండు రోజులుగా జరుగుతున్న సభ ఏర్పాట్లను ఎంఎల్‌ఎ సతీష్‌కుమార్, ప్రణాళిక సంఘం ఉపాద్యక్షులు వినోద్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరితో పాటు బిఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి శనివా రం పర్యవేక్షించారు. మైదానం చదును, వేదిక నిర్మాణం, అలాగే హెలిప్యాడ్ నిర్మాణం పనులు పరిశీలించారు. వాహనాల పార్కింగ్ పనులు పర్యవేక్షించారు. మరోసారి మండలాల వారిగా నాయకులు, కార్యకర్తలతో జనసమీకరణ గురించి సమీక్షించారు. సిఎం కెసిఆర్ ఎన్నికల పర్యటన నేపథ్యంలో అటు అధికార యంత్రాంగం, మరోవైపు పార్టీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News