Monday, November 25, 2024

ఈ దేశాల్లో స్వలింగ వివాహాలు చట్టబద్ధం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా 35 దేశాలు దేశవ్యాప్త ఓటింగ్, చట్టసభల నిర్ణయాల తర్వాత స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేశాయి. మరికొన్ని దేశాలు కోర్టు నిర్ణయాల ద్వారా చట్టబద్ధం చేశాయి. అలాగే ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ధ్ది చెందిన దేశాల్లో, స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించింది. ఇప్పటివరకు స్వలింగ వివాహానికి చట్టబద్ధత కల్పించిన చివరి దేశంగా ఎస్తోనియా(2024) నిలిచింది. కాగా మానవ హక్కుల ప్రచారం వేదిక ప్రపంచంలోని వివాహ సమానత్వం డేటా ప్రకారం, చెక్ రిపబ్లిక్, జపాన్, ఫిలిప్పీన్స్ , థాయ్‌లాండ్‌లో కూడా వివాహ సమానత్వంపై చర్చలు జరుగుతున్నాయి.

సంవత్సరం   దేశం
1989 :    డెన్మార్క్
2001 :    నెదర్లాండ్స్
2003 :    బెల్జియం
2005 :    కెనడా, స్పెయిన్
2006 :    దక్షిణాఫ్రికా
2009 :    నార్వే, స్వీడన్
2010 :    ఐస్లాండ్, పోర్చుగల్, అర్జెంటీనా.
2012 :     డెన్మార్క్
2013 :     ఉరుగ్వే, న్యూజిలాండ్, ఫ్రాన్స్, బ్రెజిల్.
2014 :     ఇంగ్లాండ్ అండ్ వేల్స్, స్కాట్లాండ్.
2015 :     లక్సెంబర్గ్, ఐర్లాండ్,అమెరికా,చిలీ.
2016 :     గ్రీన్‌ల్యాండ్, కొలంబియా
2017 :     ఫిన్లాండ్, జర్మనీ, మాల్టా, ఆస్ట్రేలియా, స్లోవేనియా
2019 :     ఆస్ట్రియా, తైవాన్, ఈక్వెడార్
2020 :     ఐర్లాండ్,కోస్టా రికా
2021 :     జపాన్‌లోని కొన్ని మున్సిపాలిటీల్లో అమలు
2022 :     స్విట్జర్లాండ్, మెక్సికో, చిలీ, స్లోవేనియా, క్యూబా
2023 :     అండోరా
2024 :     ఎస్తోనియా (అమలు కానుంది)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News