Monday, December 23, 2024

బాలీవుడ్ నటుడు సమీర్ కక్కర్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

ముంబై: ప్రముఖ నటుడు సమీర్ కక్కర్ బుదవారం తెల్లవారుజామున ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.71 సంత్సరాల సమీర్ కక్కర్ శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరగా క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతోపాటు వివిధ అంగాలు పనిచేయకపోవడంతో తెల్లవారుజామున 4.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన సోదరుడు గణేశ్ కక్కర్ తెలిపారు. బహుళ ప్రాచుర్యం పొందిన నుక్కడ టీవీ సీరియల్‌లో కోప్డి పాత్రతో వించిగుర్తింపు పొందిన సమీర్ 1987లో సింగీతం శ్రీనివాసరారవు దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన మూకీ చిత్రం పుష్పక విమానంలో కూడా నటించారు. నుక్కడ్, సర్కస్, శ్రీమాన్ శ్రీమతి వంటి సీరియల్స్, పరింద, జైహో, హసీ తో ఫసీ, సీరియల్ మెన్ చిత్రాలతోపాటు, సన్ ఫ్లవర్ వెబ్ సిరీస్‌లో సమీర్ నటించారు. ఆయనకు భార్య ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News