Wednesday, January 22, 2025

సమీర్ వాంఖడే మళ్లీ బదిలీ

- Advertisement -
- Advertisement -

Sameer Wankhede transferred again

ముంబై : క్రూజ్ నౌకలో డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ కేసును తొలుత దర్యాప్తు చేసిన అప్పటి ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ కేసు దర్యాప్తు ప్రారంభంలో నిర్లిప్తంగా వ్యవహరించినందుకు గాను వాంఖడే పై చర్యలు తీసుకోవాలని ఇటీవల కేంద్రం ఆదేశించింది. ఈ క్రమం లోనే తాజాగా ఆయనను ముంబై నుంచి చెన్నైకు బదిలీ చేయడం గమనార్హం. డ్రగ్స్ కేసులో గత ఏడాదీది అక్టోబరు 3 న ఆర్యన్ ఖాన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్పటి ఎన్‌సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ సమయంలో వాంఖడే పై అనేక విమర్శలు వచ్చాయి.

డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేసేందుకే క్రూజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ సహా పలువురిని అరెస్టు చేసినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అంతేగాక నకిలీ కుల ధ్రువీకరణ పత్రంలో ఉద్యోగం పొందినట్టు ఎన్‌సీపీ నేతలు ఆరోపించారు. దీంతో వాంఖడే రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఈ క్రమం లోనే ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్‌గా వాంఖడే పదవీ కాలం ముగియడంతో ఆయనను ముంబై లోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) కు బదిలీ చేశారు. డ్రగ్స్ కేసులో వాంఖడే బృందం నిర్లిప్తంగా వ్యవహరించడమే కాక అనేక అవకతవకలకు పాల్పడినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో ఆయనపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమం లోనే ఆయనను చెన్నై లోని డీజీ ట్యాక్స్ పేయర్ సర్వీస్ డైరెక్టరేట్‌కు బదిలీ చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News