- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ సినీనటి సమీరారెడ్డికి కరోనా వైరస్ సోకింది. శనివారం కరోనా లక్షణాలు కనిపించడంతో ఆదివారం పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండి, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమీరాతో పాటు భర్త, ఇద్దరు పిల్లలు కూడా కోవిడ్-19 టెస్టులు చేయించుకున్నారని ఆమె చెప్పారు. కాగా, సమీరారెడ్డి ఫ్యామిలీ గోవాలో ఉంటున్న విషయం తెలిసిందే. మరోవైపు కోలీవుడ్ నటుడు అధర్వకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోంఐసోలేషన్ లో ఉన్నట్టు ఆయన తెలిపాడు. ఇప్పటివకే దేశంలో పలువురు ప్రముఖులకు కరోనా వైరస్ సోకింది.
Sameera Reddy tests positive for Covid-19
- Advertisement -