Saturday, January 18, 2025

రాహుల్ ద్రావిడ్ కుమారుడు బ్యాటింగ్ సూపర్…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్, మాజీ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో ఆకట్టుకుంటున్నాడు. అండర్ 19 ట్రోఫీలో అతడు కర్నాటక తరఫున ఆడుతున్నాడు. జమ్ము కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో సమిత్ 159 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 98 పరుగులు చేసి ఔరా అనిపించాడు. దీంతో జమ్ముపై కర్నాటక 130 పరుగుల తేడాతో గెలుపొందింది. రాహుల్ ద్రావిడ్ ఆడిన కవర్ డ్రైవ్ షాట్‌లు సమిత్ బ్యాటింగ్‌లో కనిపించడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ ప్రశంసలు కరిపిస్తున్నారు. సమిత్ తన బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసిన జమ్ము వెన్నువిరిచాడు. ఇప్పటి వరకు సమిత్ ఐదు మ్యాచ్‌ల్లో 280 పరుగులు చేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News