Friday, November 15, 2024

సమ్మక్క సారలమ్మ మహాజాతర…. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19 వరకు…

- Advertisement -
- Advertisement -

ఫిబ్రవరి 16వ తేదీ- నుంచి 19వ తేదీ వరకు
సమ్మక్క సారలమ్మ మహాజాతర
తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం
ఇప్పటికే చివరిదశలో అభివృద్ధి పనులు

Sammakka sarakka jatara 2022

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ కంభమేళాగా, ఆసియాలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన వనదేవతల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. సమ్మక్క- సారలమ్మ మహా జాతర -2022 తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 16వ తేదీ- నుంచి 19వ తేదీ వరకు ఈ మహా జాతర జరగనుంది. రెండేళ్లకు ఒక్కసారి వచ్చే ఈ మహా జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం అమ్మవార్లను దర్శించకునేందుకు వస్తారు. కోవిడ్ మొదలైన తర్వాత మొదటిసారి జాతర జరుగుతుండటంతో ఈసారి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం జాతరకు సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభించగా ఈ జాతర పనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.75 కోట్లను విడుదల చేసింది.

16న సారలమ్మ కన్నెపల్లి నుంచి గద్దెపైకి రాక

సమ్మక్క- సారలమ్మ మహా జాతర -2022 తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 16- నుంచి 19 వరకు ఈ మహా జాతర జరగనుంది. 16న సారలమ్మ కన్నెపల్లి నుంచి గద్దెపైకి రాక, 17న చిలకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి రాక, 18న భక్తులకు అమ్మవార్ల దర్శనం, 19న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు. ఈ జాతరకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వివిధ శాఖల అధికారులతో జాతర పనులను ప్రభుత్వం చేపడుతుంది. జాతరకు సమయం దగ్గర పడుతుండటంతో పనుల్లో వేగం పెంచాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. జాతర సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో కొందరూ భక్తులు ఇప్పటి నుంచే అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తుండడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News