- Advertisement -
ములుగు: నేడు మేడారం జాతరలో అసలు ఘట్టం ఆవిష్కరణకానుంది. సమ్మక్క దేవత వనం నుంచి జనంలోకి ఆగమనం చేయనుంది. చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరణిరూపంలో సమ్మక్క దేవతను తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠచేయనున్నారు. ప్రభుత్వం తరుపున మంత్రి సీతక్క స్వాగతం పలకనున్నారు. ములుగు ఎస్పీ, కలెక్టర్ గాల్లో కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలకనున్నారు. మేడారం జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వన దేవతలకు మొక్కులు చెల్లించుకునే క్రమంలో జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. 24వ తేదీన సమ్మక్క-సారలమ్మ వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.
- Advertisement -