- Advertisement -
మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాత వైభవోపేతంగా జరుగుతోంది. సమ్మక్క-సారలమ్మ దర్శనం కోసం భారీగా భక్తులు తరలివస్తున్నారు. 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతోంది వనదేవతల జాతర. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు సాయంత్రం గద్దెలపైకి చేరుకుంటారు. రేపు సమ్మక్క తల్లి మేడారం గద్దెలపైకి చేరుకోనున్నారు. రేపు వనదేవతల జాతరకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. ఇప్పటికే మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. వన దేవతల దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎపి, తెలంగాణతో పాటు ఛత్తీస్ గఢ్ నుంచి భక్తులు తరలివస్తున్నారు. మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మేడారం జాతరకు టిఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
- Advertisement -