Thursday, January 23, 2025

డిఫరెంట్ లవ్ స్టోరీ

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే‘ చిత్రం ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గురువారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్‌ను తీసుకోవడం విశేషం. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటించింది. టీజర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది. గోపీనాథ్ రెడ్డి ఓ డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News