Monday, July 8, 2024

మమ్ముట్టితో సమంత నటించబోతోందా?!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సమంత మళ్లీ సినిమా షూటింగ్ కు రెడీ. ఆమె ఆరోగ్యం ఇప్పుడు కాస్త కుదుటపడింది. అయితే  మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టితో ఓ సినిమా చేయబోతోందని సమాచారం. ఆమెకు ‘ఏ మాయ చేశావే’ సినిమాతో గుర్తింపు తెచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ కోరిక మేరకు సమంత మొదటిసారి మలయాళం సినిమాలో నటించబోతోంది. అయితే దీనిపై ఇప్పటికైతే అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఏది ఎలా ఉన్న సమంత మలయాళంలోనే కాక టాలీవుడ్ లో కూడా బిజీ కానున్నదని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

Mamooty

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News