గజ్వేల్: ప్రధాని మోడీ 9 యేండ్ల పాలనపై మేధావులకు , వివిధ వర్గాల ప్రజలను కలిసి వా రికి వివరించే లక్షంతో సంపర్క్ సే సమర్థన్ అనే పేరుతో శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకర్గంలో కేంద్ర మత్య, పశుసంవర్ధ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గజ్వేల్, ప్రజ్ఞాపూర్, మర్కూక్,వర్గల్ మండల కేంద్రాలలో పర్యటించా రు. బిజెపి తొమ్మిది సంవత్సరాల పాలనను ప్రజలకు వివరిస్తూ పుస్తకాలను ప్రజలకు, మేధావులకు ఆయన పంచిపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూ పాల ప్రజ్ఞాపూర్‌లో లోక్ సత్తా ఉద్యమ సంస్థ ఉభయ తె లుగు రాష్ట్రాల కన్వీనర్ , లాయర్ బండారు రాంమోహన్ రావు నివాసానికి వెళ్లారు.
అక్కడ చాలాసేపు రాంమోహన్ రావుతో వర్తమాన రాజకీయాలపై కేంద్ర మంత్రి చర్చించారు. ప్రజ్ఞాపూర్ గ్రామ చరిత్రను కూడా కేంద్ర మంత్రికి రాంమోహన రావు తెలిపారు. అక్కడ బండారు రామేశ్వర రావు ఇంటిలో నిర్వహిస్తున్న గ్రామ గ్రంధాలయం, వైద్య ఆరోగ్య ఉపకేంద్రాన్ని (పల్లె దవాఖానను) పరిశీలించిన కేంద్ర మంత్రి ఇలా ప్రైవేటు ఇండ్లలో వీటిని నిర్వహించటం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న కోదండ రామాలయాన్ని ఆయన పరిశీలించారు. ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక పురాతన పెంకుటిల్లును చూ సిన కేంద్ర మంత్రి రూపాలా ఆ ఇంటి విశేషాలను రాం మోహన్ రావును అడిగి తెలుసుకున్నారు. ఆ ఇంటిలో 70 సంవత్సరాల కిందట తందనాన రామాయణాన్ని రచించిన మౌళి త్రయంలోని మూడో వాడైన విధుమౌళి శాస్త్రి గురించి కేంద్ర మంత్రికి రాంమోహన్‌రావు వివరించారు.
గజ్వేల్‌కు రైలును నడపండి
బండారు రాంమోహన్ రావు కొన్ని స్థానిక సమస్యలను కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా దృష్టికి తెచ్చారు. మనోహరాబాద్= కొత్తపల్లి మార్గంలో గజ్వేల్ వరకు రైల్వే లై న్ పూర్తయి సుమారు మూడు సంవత్సరాలు కావస్తుంద ని, ఇప్పటి వరకు రైలు నడపటం లేదని కేంద్ర మంత్రి దృ ష్టికి తెచ్చారు. ఇప్పటికైనా గజ్వేల్ వరకు రైలును నడపాలని ఆయన కోరారు. 2016లో ప్రధాని మోదీ స్వ యంగా ఈ రైల్వే లైన్‌కు శంకుస్థాపన చేశారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే ఈ లైన్‌లో రైలు ను నడపాలని ఆయన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలాను కోరారు. గజ్వేల్ రైల్వే స్టేషన్‌కు గజ్వేల్‌కు బదులుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గా మార్చలని ఆయన కోరారు. అనంతరం కేంద్ర మంత్రి గజ్వేల్ పట్టణంలోని బీడీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన లాయర్ వి వి రమణ నివాసంలో పలువురు వైద్యులను, లాయర్లను, లయన్స్ క్లబ్ సభ్యులను, ఇతర సంస్థల ప్రతినిధులతో స మావేశమయ్యారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిక్రిష్ణతో పాటు న్యాయవాదులు వివి రమణ,అరుణ్ కుమార్, బండారు రాం ఫణిధర్ రా వు, ఐఎంఎ అధ్యక్షుడు డా. లింగం ఎలిశాల,డా. నరేష్ బాబు, డా.కుమార స్వామి తదితరులతో బిజెపి 9 సంవత్సరాల పాలనపై కేంద్ర మంత్రి రూపాల వివరించటం తో పాటు ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలను వారికి కేం ద్రమంత్రి అందచేశారు. ఈ సందర్భంగా లాయర్లు కేంద్ర మంత్రిని ఘనంగా శాలువా బొకేలతో సన్మానించారు. అనంతరం ఆయన మర్కూక్, వర్గల్ పర్యటనకు వెళ్లారు. ఉమ్మడి కరీం నగర్ జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు , మెదక్ ఇంచార్జి జయశ్రీతో పాటు గజ్వేల్, సిద్దిపేట బిజెపి నాయకులు ,టిజెయు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కప్పర ప్రసాద రావు, బింగి స్వామి, లయన్స్ క్లబ్ రీజినల్ ఛైర్మన్ గుడాల రాధా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వర్గల్, మర్కూక్ మండలాల పర్యటనకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల వెళ్లారు.