గురుగ్రామ్: వినియోగదారులు తమ ఆరోగ్యాన్ని మరింత సమగ్రంగా నిర్వహించడంలో సహాయ పడటానికి వీలుగా సామ్‌సంగ్ హెల్త్ యాప్2 నకు మెడికేషన్స్ ట్రాకింగ్ ఫీచర్1ని జోడించినట్లు భారతదేశ అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్ ప్రకటించింది.
ఈ ఫీచర్ వినియోగదారులకు వారికి సిఫారసు చేయబడిన లేదా ఓవర్ ది కౌంటర్ మందుల విధానాన్ని ట్రాక్ చేయడానికి వీలు కల్పించడమే కాకుండా ముఖ్యమైన వైద్య సమాచారం, చిట్కాలను కూడా అందిస్తుంది. రక్తపోటు, మధుమేహం, పిసిఒఎస్, పిసిఒడి మరియు సకాలంలో మోతాదులు అవసరమయ్యే ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి చికిత్సలో ఉన్న వారికి మందులకు కట్టుబడి ఉండే స్థిరత్వాన్ని ట్రాక్ చేయడంలో ఈ ఫీచర్ సహాయపడుతుంది.
“సామ్‌సంగ్ అనేది తన కొనుగోలుదారులకు మొదటి స్థానం ఇచ్చే బ్రాండ్. ఇది వారి దైనందిన జీవితాన్ని మెరుగుపరచ డానికి కావాల్సిన ఉత్పత్తులు, సేవలపై నిరంతరం పని చేస్తుంది. పరికరాలు, సేవలను కనెక్ట్ చేయడం ద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, నిర్వహించడానికి సంపూర్ణ ఆరోగ్య వేదికను రూపొందించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో భారతదేశానికి సంబంధించి మెడికేషన్స్ ఫీచర్‌ను జోడించడంతో, వినియోగదా రులు తమ మందులను మరింత సౌకర్యవంతంగా నిర్వహించగలరని, కట్టుబడి ఉండడాన్ని మెరుగు పరచగలరని, అంతి మంగా మెరుగైన ఆరోగ్యాన్ని కాపాడుకోగలరని మేం విశ్వసిస్తున్నాం” అని నోయిడాలోని సామ్‌సంగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ క్యుంగ్యున్ రూ అన్నారు.
సామ్‌సంగ్ లోని ఆర్ అండ్ డి, డిజైన్ మరియు కన్స్యూమర్ ఎక్స్‌పీరియన్స్ టీమ్‌ల మధ్య సహకార ప్రయత్నం ఫలితంగా మెడికేషన్స్ ఫీచర్ భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో ఎంపిక చేసిన మందుల పేరును నమోదు చేసిన తర్వాత, మెడికేషన్స్ ఫీచర్ వినియోగదారులకు సాధారణ వివరణలతో పాటు దానితో వచ్చేందుకు అవకాశం గల దుష్ప్రభావాలతో సహా వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది.
అంతేగాకుండా, ఔషధాల మధ్య పరస్పర చర్యలు, ఇతర సంబంధిత భద్రతా మార్గదర్శకాలు మొదలుకొని ప్రతికూల ప్రభావాల దాకా సమాచారాన్ని అందిస్తుంది. వినియోగదారులు సామ్‌సంగ్ హెల్త్ యాప్ ద్వారా తమ మందులను ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వాటిని తిరిగి కొనాలి అనే విషయాలను గుర్తు చేయడానికి అలర్ట్స్ ను సెటప్ చేయవచ్చు.
ఈ అలర్ట్స్ వినియోగదారు వ్యక్తిగత అవసరానికి చక్కగా ట్యూన్ చేయబడతాయి, కాబట్టి ఆయా ఔషధాలు వినియోగదా రుకు వాటి ప్రాముఖ్యతను బట్టి ప్రాధాన్యత ఇవ్వబడతాయి. సామ్‌సంగ్ హెల్త్ “జెంటిల్” నుండి “స్ట్రాంగ్” వరకు రిమైండ ర్లను పంపుతుంది. గెలాక్సీ వాచ్ వినియోగదారులు వారి మణికట్టుపైనే ఈ రిమైండర్‌లను కూడా స్వీకరించ గలుగుతారు, తద్వారా వారు తమ ఫోన్‌లకు దూరంగా ఉన్నప్పుడు కూడా వారి మందుల షెడ్యూల్‌పై దృష్టి పెడుతూ ఉండగలరు.
సామ్‌సంగ్ హెల్త్ యాప్ ఇప్పటికే స్లీప్ మేనేజ్‌మెంట్3, మైండ్‌ఫుల్‌నెస్ ప్రోగ్రామ్‌లు మరియు క్రమరహిత హార్ట్ రిథమ్ నోటిఫికేషన్4 సామర్థ్యాలకు విస్తరించి ఉన్న అధునాతన ఆరోగ్య ఆఫర్‌లను అందిస్తుంది. భారతదేశంలో మెడికేషన్ ట్రాకింగ్ ఫీచర్ పరిచయం చేయడం అనేది తన వినియోగదారుల కోసం సంపూర్ణ ఆరోగ్య అనుభవాలను సృష్టించడానికి సామ్‌సంగ్ కు గల నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది, తద్వారా వారు ఆరోగ్యకరమైన, మరింత సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి వీలు కల్పిస్తుంది.
యాప్ అప్‌డేట్స్ ద్వారా భారతదేశంలోని సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో మెడికేషన్స్ ట్రాకింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
1సామ్‌సంగ్ హెల్త్ మెడికేషన్ ఫీచర్ వినియోగదారులు తమ మందుల జాబితా మరియు షెడ్యూల్‌ను నిర్వహించడంలో సహాయపడటానికి ఉద్దేశించబడింది. అందించిన సమాచారం టాటా 1mg నుండి లైసెన్స్ పొందిన ఎవిడెన్స్ బేస్డ్ కంటెంట్.
2ఆండ్రాయిడ్ 10.0 లేదా తదుపరిది మరియు సామ్‌సంగ్ హెల్త్ యాప్ వెర్షన్ 6.28 లేదా తదుపరిది కలిగిన స్మార్ట్‌ఫోన్ అవసరం. ఫీచర్‌ల లభ్యత పరికరాన్ని బట్టి మారవచ్చు.
3స్లీప్ ఫీచర్‌లు సాధారణ ఆరోగ్యం, ఫిట్‌నెస్ ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడ్డాయి. కొలతలు మీ వ్యక్తిగత రెఫరెన్స్ కోసం మాత్రమే. దయచేసి సలహా కోసం వైద్య నిపుణుడిని సంప్రదించండి.
4 IHRN ఫీచర్ ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. Wear OS పరికరాల వెర్షన్ 4.0 లేదా తర్వాతి వాటిలో అందుబాటులో ఉంది. ఇది AFib సూచించే క్రమరహిత రిథమ్ యొక్క ప్రతి ఎపిసోడ్‌పై నోటిఫికేషన్‌ను అందించ డానికి ఉద్దేశించబడలేదు మరియు నోటిఫికేషన్ లేకపోవడం ఎలాంటి వ్యాధి ప్రక్రియ లేదని సూచించడానికి ఉద్దేశించబడ లేదు. ఇది ఇతర తెలిసిన అరిథ్మియా ఉన్న వినియోగదారుల కోసం ఉద్దేశించబడలేదు. ఈ ఫీచర్‌లకు సామ్‌సంగ్ హెల్త్ మానిటర్ యాప్ ద్వారా మద్దతు ఉంది. మార్కెట్ లేదా పరికరాన్ని బట్టి లభ్యత మారవచ్చు. మెడికల్ డివైజ్ (SaMD)గా సాఫ్ట్‌వేర్‌గా ఆమోదం/రిజిస్ట్రేషన్ పొందడంలో మార్కెట్ పరిమితుల కారణంగా, ప్రస్తుతం సర్వీస్ అందుబాటులో ఉన్న మార్కెట్‌లలో కొనుగోలు చేసిన వాచ్‌లు, స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే ఇది పని చేస్తుంది (అయితే, వినియోగదారులు నాన్-సర్వీస్ మార్కెట్లకు వెళ్లినప్పుడు సేవ పరిమితం చేయబడవచ్చు). ఈ యాప్‌ను 22 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో మాత్రమే కొలిచేందుకు ఉపయోగించవచ్చు.