గురుగ్రామ్: సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ తమ బెస్పోక్ ఏఐ లాండ్రీ ఉపకరణాల శ్రేణి బెస్పోక్ ఏఐ లాండ్రీ వెంటెడ్ కాంబో కు ఆల్-ఇన్-వన్ వాషర్ మరియు ఎలక్ట్రిక్ డ్రైయర్‌ను జోడించినట్లు ప్రకటించింది. ఏడు అంగుళాల ఏఐ హోమ్ టచ్‌స్క్రీన్‌తో కూడిన ఈ మిశ్రమ యూనిట్ వాషింగ్ మరియు డ్రైయింగ్ మధ్య లాండ్రీని బదిలీ చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది.
“సామ్‌సంగ్ వద్ద , జీవితాన్ని సులభతరం చేసే, మరింత సమర్థవంతమైన స్థిరమైన స్మార్ట్ హోమ్ సొల్యూషన్‌లను సృష్టించడం మా లక్ష్యం. అదే సమయంలో పనితీరు , శైలి రెండింటిలోనూ ఇంటి ప్రాంగణాన్ని తదుపరి స్థాయికి తీసుకుని వెళ్లాలనుకుంటున్నాం ” అని సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌లో డిజిటల్ ఉపకరణాల వ్యాపారం కోసం ఈవిపి, ఆర్ &డి హెడ్ జియోంగ్ సీయుంగ్ మూన్ అన్నారు.
లభ్యత, ముందస్తు ఆర్డర్లు
సామ్‌సంగ్ యొక్క బెస్పోక్ ఏఐ లాండ్రీ వెంటెడ్ కాంబో రెండు ప్రీమియం రంగులలో వస్తుంది. యుఎస్ వినియోగదారుల కోసం డార్క్ స్టీల్ మరియు బ్రష్డ్ బ్లాక్ లో అందుబాటులో ఉంటే, బ్రష్డ్ బ్లాక్ మాత్రమే కెనడాలో మరియు డార్క్ స్టీల్ మెక్సికోలో అందుబాటులో ఉంది. బెస్పోక్ ఏఐ లాండ్రీ వెంటెడ్ కాంబో ఇప్పుడు యుఎస్ లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. కెనడా మరియు మెక్సికోలో 2025 2వత్రైమాసికంలో అందుబాటులో ఉండనుంది.