మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్‌సంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ఎ54 5జి, గెలాక్సీ ఎ34 5జిలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్లు దేశంలోని వినియోగదారులను 5జి వినియోగించేలా చేస్తాయని సామ్‌సంగ్ ఇండియా(మొబైల్ బిజినెస్) జనరల్ మేనేజర్ అక్షయ్ రావు అన్నారు. ప్రీమియం లుక్ కల్గిన గెలాక్సీ ఎ54 5జి, గెలాక్సీ ఎ34 5జి దీర్ఘకాల బ్యాటరీ లైఫ్, మెరుగైన వినోద లక్షణాలతో వచ్చాయి. సిగ్నేచర్ గెలాక్సీ డిజైన్, నైట్‌గ్రఫీ వంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్‌లను ఉన్నాయి. ఇవి తక్కువ వెలుతురులోనూ తీక్షణమైన చిత్రాలు, వీడియోలను షూట్ చేసేందుకు వినియోగదారులకు సహాయపడతాయని అక్షయ్ వివరించారు. గెలాక్సీ ఎ54 రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ.38,999, రూ.40,999, అలాగే గెలాక్సీ ఎ34 ధరలు వరుసగా రూ.30,999, రూ.32,999గా ఉన్నాయి. మార్చి 28 నుంచి ఈ ఫోన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎ54, ఎ34 సిరీస్ లాంచ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -