Thursday, December 26, 2024

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దక్షిణ కొరియాకు చెందిన టెక్ కంపెనీ సామ్‌సంగ్ తన అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ సిరీస్ గెలాక్సీ ఎస్24ను విడుదల చేసింది. దీనిలో గెలాక్సీ ఎస్24 అల్ట్రా, గెలాక్సీ ఎస్24+, గెలాక్సీ ఎస్24 ఉన్నాయి. వాటి ధర రూ. 80,000 నుండి మొదలై రూ. 1,59,999 వరకు ఉంటుంది. మూడు స్మార్ట్‌ఫోన్‌ల ప్రీ-బుకింగ్ ప్రారంభించారు. త్వరలో వాటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 24+ ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్‌లు రూ. 22,000 విలువైన ప్రీ-బుకింగ్ ప్రయోజనాలను పొందుతారు.

గెలాక్సీ ఎస్ 24ని ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్‌లు రూ.15,000 విలువైన ప్రీ-బుకింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలోని శాన్ జోస్ శాప్ సెంటర్‌లో గురువారం రాత్రి (జనవరి 17) జరిగిన కార్యక్రమంలో నోట్ అసిస్ట్, చాట్ అసిస్ట్, రియల్-టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, సర్కిల్ టు సెర్చ్ వంటి అనేక అధునాతన ఎఐ ఫీచర్లతో మూడు స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ పరిచయం చేసింది. ఎస్24 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు 7 సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతాయి. ఫోటో అసిస్ట్ ఫీచర్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌లో అందుబాటులో ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News