- Advertisement -
న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్‌సంగ్ తన మొట్టమొదటి ఎంటర్‌ప్రైజ్ ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ – గెలాక్సీ ఎక్స్‌కవర్7 ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దృఢంగా ఉండే ఈ ఉత్పత్తి అసాధారణమైన వినియోగాన్ని అందిస్తుంది. గెలాక్సీ ఎక్స్ కవర్ 7 విపరీతమైన పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు. భారతదేశంలో తయారు చేయబడిన గెలాక్సీ ఎక్స్ కవర్ 7 అధునాతన 5జి కనెక్టివిటీ, అప్‌గ్రేడ్ చేసిన మొబైల్ ప్రాసెసర్ పనితీరుతో మెరుగైన మొబిలిటీని అందిస్తుంది. పెరిగిన టచ్ సెన్సిటివిటీతో, గెలాక్సీ ఎక్స్ కవర్ 7 గ్లోవ్స్ ఉన్నప్పటికీ వాడేందుకు మద్దతు ఇస్తుంది. ఇది ఉద్యోగుల ఉత్పాదకతను పెంచుతుందని, డేటా భద్రతను నిర్ధారిస్తుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఆకాష్ సక్సేనా అన్నారు.
- Advertisement -