Sunday, January 5, 2025

ఈ శామ్‌సంగ్ ఫోన్ పై భారీ తగ్గింపు!

- Advertisement -
- Advertisement -

ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఫ్లిప్ కార్ట్ – అమెజాన్ ఒక సూపర్ డీల్ అయితే ఉంది. ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లలో సేల్ జరుగుతోంది. ఈ ఫోన్ అద్భుతమైన పనితీరు, హై-ఎండ్ ఫీచర్‌లకు ప్రసిద్ధి చెందినది. అదే శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా. ఈ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఏ ప్లాట్‌ఫారమ్‌లలో ఎంత డిస్కౌంట్ తో లభిస్తుందో చూద్దాం.

 

ఆఫర్ వివరాలు

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా ప్రారంభ ధర రూ. 1,49,999 గా ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్‌పై 47% వరకు భారీ తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 78,900కి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా.. మీరు బ్యాంక్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందడం ద్వారా అదనపు తగ్గింపులను పొందవచ్చు. ఒకవేళ బడ్జెట్ లేకుంటే నెలకు కేవలం రూ. 2,792 EMI తో కూడా కొనుగోలు చేయొచ్చు.

మరోవైపు.. ఫ్లిప్‌కార్ట్‌తో పోలిస్తే అమెజాన్ ఈ ఫోన్‌పై గొప్ప ఆఫర్‌ను అందిస్తోంది. ఈ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా పై దాదాపు 51% వరకు తగ్గింపును పొందొచ్చు. అంటే.. ఇప్పుడు దీనిని కేవలం రూ. 72,999 కి దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఇది కాకుండా.. అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఇందులో పాత ఫోన్‌ నేరుగా ఎక్స్ఛేంజ్ చేసి రూ. 27,550 వరకు ఆదా చేసుకోవచ్చు.

 

ఫీచర్లు

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా ఫోన్ 6.8-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను 1750 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో కలిగి ఉంది. అంతేకాకుండా గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉంది. కాగా, ఈ స్మార్ట్ ఫోన్ 12 జిబి రామ్, 1 టిబి వరకు నిల్వ ఎంపికను కలిగి ఉంది.

ఇక ఫోటోగ్రఫీ కోసం.. ఈ ఫోన్‌లో 200MP ప్రైమరీ కెమెరా ఉంది. ఇది ప్రతి ఫోటోకు ప్రొఫెషనల్ రూపాన్ని ఇస్తుంది. ఈ ఫోన్ లో 10MP + 10MP + 12MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. బ్యాటరీ గురుంచి చెప్పాలంటే.. ఈ స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News