Wednesday, December 25, 2024

కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రులు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీకి వరుసషాక్‌లు తగులుతున్నాయి. పలువురు బిఆర్‌ఎస్‌కు చెందిన కీలక నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపిలు కాంగ్రెస్ కండువా సైతం కప్పుకున్నారు. తాజాగా బిఆర్‌ఎస్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, మాజీ మంత్రి రాజేశ్వర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి సిఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి ఆదిలాబాద్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కాంగ్రెస్ నాయకుడు ఈరవత్రి అనిల్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News