Monday, December 23, 2024

ఎమ్మెల్యే రాజప్ప…

- Advertisement -
- Advertisement -

హీరో నితిన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో విలన్‌ని పరిచయం చేసింది చిత్ర యూనిట్. ‘మాచర్ల నియోజకవర్గం’ నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యే రాజప్ప పాత్రలో కనిపించబోతున్నారు విలక్షణ నటుడు సముద్రఖని. మాచర్ల నియోజకవర్గంలో రాజప్పకు ప్రతిపక్షమే లేదు. నెరిసిన జుట్టు, మెలితిరిగిన మీసం, నుదిటిన తిలకం, మెడలో రుద్రాక్షమాలతో వింటేజ్ పొలిటిషియన్ లుక్ లో కనిపించిన సముద్రఖని పేపర్‌లపై సంతకం చేస్తూ సీరియస్‌గా కనిపించాడు. ఐఏఎస్ అధికారిగా నితిన్, ఎమ్మెల్యే మధ్య పోరు ఇందులో ఆసక్తికరంగా వుండబోతుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా ఈ చిత్రంలో కథానాయికలు.

Samuthirakani first look out from Macherla Niyojakavargam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News