Monday, December 23, 2024

కేంద్రం రైతాంగానికి ఇచ్చిన హామీల అమలుకు ఆందోళనలు…

- Advertisement -
- Advertisement -
సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాత పూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దశాల వారీగా ఆందోళనలు నిర్వహిస్తామని సహిత కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో వారు కిసాన్‌మోర్చా రాష్ట్ర నాయకులు టి.సాగర్, మురళీరెడ్డి తదితరులు మాట్లాడుతూ కనీస మద్దతు ధరల చట్టం చేస్తానని, విద్యుత్ సవరణ బిల్లు ను ఉపసంహరిస్తామని, రైతుల పై అక్రమంగా మోపిన కేసులను ఎత్తివేస్తామని,పంటల బీమా పథకాన్ని సవరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు.కానీ హామీలను పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటున్నదన్నారు.

పంటల కొనుగోలు బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంటున్నదని, కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేయడానికి సిద్ధంగా లేదన్నారు.ప్రజా పోరాటాల పై తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తున్నదన్నారు. వ్యవసాయ రంగాన్ని విదేశీ ,స్వదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా దేశభక్తియుత పౌరులంతా రైతాంగానికి అండగా నిలవాలని విజ్ణప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు గుమ్మడి నరసయ్య, వి. ప్రభాకర్, కే గోవర్ధన్ వి. కోటేశ్వరరావు, మండల వెంకన్న, బాబన్న తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News