Monday, January 20, 2025

రెజ్లర్లకు మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా నిరసనలు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: రెజ్లర్లకు మద్దతుగా దేశ వ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా నిరసనలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ సహా దేశవ్యాప్త నిరసనలకు ఎస్‌కెఎం పిలుపునిచ్చింది. రెండు వారాలుగా జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన చేపట్టారు. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు లైంగికంగా వేధించారని రెజ్లర్ల ఆరోపణలు చేస్తున్నారు. బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లను ఎస్‌కెఎం నేతలు కలిసి మద్దతు ఇవ్వనున్నారు.

Also Read: రెజ్లర్ల నిరసన: చిక్కుల్లో బిజెపి

రెజ్లర్లను యుపి, పంజాబ్, ఢిల్లీ, హర్యానా ఎస్‌కెఎం నేతలు కలువనున్నారు. హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ రెజ్లర్లకు మద్దతుగా నిలిచారు. రెజ్లర్ల తరఫున మోడీ ప్రభుత్వంతో మాట్లాడానికి సిద్ధంగా ఉన్నానని అనిల్ విజ్ పేర్కొన్నారు. జంతర్ మంతర్ నుంచి రెజ్లర్ల మార్చ్ నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునివ్వడంతో పోలీసులు అధికారులు భద్రతా పెంచారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ తమని లైంగికంగా వేధించడంతో తొలగించాలని రెజ్లర్లు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే.

Also Read: రెండు కుటుంబాల మధ్య జరిగే కథ..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News