Thursday, December 26, 2024

‘స్వయంభు’ కోసం సంయుక్త మీన‌న్ హార్స్ రైడింగ్..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ లో వరుస విజయాలతో జోరుమీదున్నారు హీరోయిన్ సంయుక్త మీనన్‌. సార్, విరూపాక్ష, డెవిల్ సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడికి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం సంయుక్త మీనన్.. యంగ్ హీరో నిఖిల్ కు జోడీగా స్వయంభు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసం నిఖిల్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సంయుక్త కూడా ఈ సినిమా కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నారు సంయుక్త. గుర్రంపై కుర్చున్న ఫోటోను తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

“2024.. నా గురించి, నా జీవితం గురించి చాలా విషయాలు నేర్పించింది. జీవితంలో సాహసాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. నేనెప్పుడూ కంఫర్ట్ జోన్ లో ఉండాలనుకోను. ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకుంటా. ప్రస్తుతం నా నెక్ట్స్ మూవీ స్వయంభు కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను. గుర్రంపై ప్రయాణం చేయడం నాకు చాలా ఇష్టం. నన్ను నమ్మండి ఈ ప్రయాణం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది” అని ఎక్స్ లో చెప్పుకొచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News