Thursday, January 23, 2025

మోడ్రన్ యువతిగా కనిపిస్తా..

- Advertisement -
- Advertisement -

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’తో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన సంయుక్త మీనన్ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్‌తో కలిసి ‘బింబిసార’ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో సంయుక్త మీనన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “బింబిసార… టైమ్ ట్రావెల్ మూవీ. ప్రస్తుత కాలంలో, అలాగే చాలా ఏళ్ల క్రితం జరిగిన కథతో సినిమా నడుస్తుంది. ప్రస్తుత కాలంలో జరిగే కథలో మోడ్రన్ యువతిగా నటిస్తున్నాను. సింపుల్ పాత్ర కావడంతో ఎక్కువ కష్డపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక కల్యాణ్ రామ్ చాలా ఎమోషనల్ యాక్టర్. ఆయన కళ్లతోనే భావాలను పలికిస్తారు. బింబిసార సినిమా షూట్‌కు మొదటిసారి వెళ్లినప్పుడు రాజు గెటప్‌లో ఆయన ఉన్నాడు. ఓ సీన్‌లో ఆయన చూపును చూస్తే..నిజంగా రాజులానే పాత్రలో లీనమై కనిపించాడు. ఆయన పర్ఫార్మెన్స్‌కు అది ఒక శాంపిల్‌”అని అన్నారు.

Samyuktha Menon interview about ‘Bimbisara’

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News