Sunday, December 22, 2024

మన జీవితాన్ని సనాతన ధర్మం ఎలా నడిపిస్తుందనేది చెప్పాం

- Advertisement -
- Advertisement -

బొమ్మకు మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇం డియా ఫైల్స్ సినిమా నుండి జై ఇండియా సాంగ్ వి డుదల చేశారు. ఈ సినిమా లో రాజకీయ నేత అద్దంకి దయాకర్, సితార, ఇంద్ర జ, సుమన్. శుభలేఖ సుధాకర్, హిమజ, రవి ప్రకాష్, జీవన్ కుమార్ వంటి నటీనటులు నటిస్తుండగా బొమ్మకు క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను బొమ్మకు మురళి స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా, జై ఇండియా అనే సాంగ్‌కి మాత్రం ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ సంగీతం అందించి, స్వరాన్ని సమకూర్చారు.

ఈ వేడుకకి హాజరైన అతిరధమహారధులు ఈ చిత్ర యూనిట్ కి తమ బెస్ట్ విషెస్ తెలిపి, పాట ఎంత పెద్ద హిట్టు అయిందో ఈ సినిమా కూడా అంత పెద్ద ఘనవిజయం సాధించాలి అని అన్నారు. సినిమా హీరో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ “ఈ సినిమా రిలీజ్ అయ్యాక, సినిమానే మాట్లాడుతుంది. ఈ సినిమా ద్వా రా మన చరిత్ర తెలుస్తుంది. ఇందులో మానవీయ కోణం అంటే ఏంటో చూపించాం. అందరికి తప్పకుండా ఈ సి నిమా నచ్చుతుంది”అని అన్నారు.

ఈ సినిమా దర్శక నిర్మాత బొమ్మకు మురళి మాట్లాడుతూ “ఈ సినిమాలో మనిషి మనుగడ గురించి చెప్పా. మనిషి పు ట్టుక నుండి ఇప్పటి వరకు మన జీవన విధానంలో జరిగిన మార్పులు, సనాతన ధర్మం మన మధ్య ఎలా నడుస్తుంది, మన జీవితాన్ని ఎలా నడిపిస్తుం ది అనేది కథగా చెప్పా. కథ మాత్రం ప్రస్తుత సమాజానికి మన చరిత్ర గురించి తెలిపేలా ఉంటుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణ గౌడ్, గురు రాజ్, సాయి వెంకట్, కనక దుర్గ నాగులపల్లి, భరత్,రాజ్ కిరణ్, మౌనశ్రీ మల్లిక్, అల్లాబక్షు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News