Saturday, December 21, 2024

కుష్టు, ఎయిడ్స్‌వంటిదే సనాతన ధర్మం: డిఎంకె ఎంపి రాజా

- Advertisement -
- Advertisement -

చెన్నై : దేశంలో సనాతన ధర్మం కుష్టువ్యాధి వంటిదై, మాయని మచ్చను ఆపాదించిందని డిఎంకె ఎంపి , ఉప ప్రధాన కార్యదర్శి ఎ రాజా వ్యాఖ్యానించారు. కుష్టు వ్యాధి గ్రస్తులను వెలివేయడం జరుగుతుందని తెలిపారు. ఇటీవలే డిఎంకె మంత్రి, స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం దేశానికి పట్టిన చీడ అని పేర్కొనడం వివాదాస్పదం అయింది. ఈ దశలోనే గురువారం కేంద్ర మాజీ మంత్రి అయిన ఎ రాజా ఈ వివాద కొనసాగింపు దిశలో మాట్లాడారు. తమ యువ నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సరైనవే అని, పైగా ఆయన సనాతన ధర్మం గురించి కొంచెం సున్నితంగా చెప్పారని, మలేరియా, డెంగ్యూ వంటిదని సరిపోల్చారని , అయితే తన దృష్టిలో సనాతన ధర్మం అంతకంటే భయంకరం , తానైతే ఇది కుష్టువ్యాధి వంటిదని చెపుతానని రాజా తెలిపారు.

గతంలో కుష్టు , హెచ్‌ఐవిలు సోకిన వారిని వెలివేసినట్లు చూసేవారని, సనాతన ధర్మం ఆచరించే వారిని కూడా ఇదే విధంగా చేయాల్సి ఉంటుందని రాజా స్పందించారు. సనాతన ధర్మం సామాజిక రుగ్మత అయిందన్నారు. సనాతన ధర్మం, హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉత్తమ హిందువు సముద్రాలు దాటి వెళ్లరాదని, మరి ప్రధాని మోడీ తరచూ సముద్రాల మీదుగా విమానాలలో విదేశాలకు వెళ్లుతున్నాడని , మరి ఆయన సనాతన ధర్మాన్ని ఉల్లంఘించి , ఇతరులకు సనాతన ధర్మం నీతులు చెపుతున్నారా? అని రాజా స్పందించారు. ప్రధాని మోడీ, అమిత్ షాలకు ధైర్యముంటే సనాతనం, వర్ణాశ్రమాలపై దేశ రాజధానిలో శంకరాచార్యుల సమక్షంలో తమతో చర్చకు వస్తారా? అని డిఎంకె నేత సవాలు విసిరారు. బిజెపి నేతలు దీనికి తేదీలు, సమయం ఖరారు చేయాలని , తమకు తెలియచేయాలని, జి 20 తరువాతైనా ఎప్పుడైనా తాము సిద్ధమని ఈ ఎంపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News