Thursday, January 23, 2025

రాజ్యాంగం నాకు ఆ హక్కు కల్పించింది: ఉదయనిధి స్టాలిన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం మద్రాసు హైకోర్టులో వాదనలు జరిగాయి. హిందూ మితవాద సంస్థకు చెందిన పిటిషనర్ సిద్ధాంతపరమైన విభేదాల కారణంగానే తనపై పటిషన్ దాఖలు చేశారని ఉదయనిధి తరఫు న్యాయవాది పి విల్సన్ వాదనలు వినిపించారు.

రాజ్యాంగంలోని 25వ అధికరణ కింద తనకు నచ్చిన మతాన్ని ఆచరించే, ప్రచారం చేసే హక్కు లభిస్తుందని, అదే విధంగా నాస్తికత్వాన్ని కూడా ఆచరించే, ప్రచారం చేసే హక్కు ఈ అధికరణ కల్పిస్తోందని విల్సన్ వాదించారు. 25వ అధికరణ (19(1)(ఎ) కింద) ప్రకారం మంత్రి ప్రసంగంలో ఎటువంటి తప్పు లేదని ఆయన జస్టిస్ అనితా సుమంత్ ఎదుట వాదించారు.

గత నెలలో జరిగిన ఒక సదస్సులో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సవాలు చేస్తూ హిందూ మున్నాని సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డిఎంకె సిద్ధాంతం హిందూ మున్నానికి పూర్తి భిన్నమని, ద్రవిడ సిద్ధాంతానికి కట్టుబడిన డిఎంకె నాయకులు ఆత్మగౌరవం, సమానత్వం, హేతువాద ఆలోచనలు, సోదరభావాన్ని పెంపొందించే విధంగా మాట్లాడతారని, కాని వైరి పక్షం మాత్రం కులాల ప్రాతిపదికన సమాజాన్ని చీలుస్తుందని ఉదయనిధి తరఫున న్యాయవాది విల్సన్ వాదించారు.

ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 31వ తేదీకి వాయిదావేసిన న్యాయమూర్తి ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్న సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రం, ఆయన వ్యాఖ్యల తాలూకు వీడియో, ఈ సదస్సులో పాల్గొన్న ఇతర అతిథులకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News