Thursday, January 23, 2025

దావూద్ ఇబ్రహీం బంగ్లాలో సనాతన ధర్మ పాఠశాల

- Advertisement -
- Advertisement -

పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులకు చెందిన రెండెకరాల భూమి శుక్రవారం వేలంలో రూ.2 కోట్లకు పైగా అమ్ముడుపోయింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తిని వేలంలో కొనుగోలు చేసిన అడ్వకేట్ అజయ్ శ్రీవాస్తవ్ అక్కడ సనాతన్ ధర్మ పథశాలను ఏర్పాటు చేస్తానని చెప్పారు. రూ.15,440 రిజర్వ్ ధర ఉన్న ప్రాపర్టీలలో ఒకటి అత్యధికంగా రూ.2.01 కోట్ల బిడ్‌ను అందుకుంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తహసీల్‌లోని ఇబ్రహీం పూర్వీకుల గ్రామంలో ఉన్న మొత్తం నాలుగు ఆస్తులను వేలం వేశారు.

దావుద్ ఇబ్రహీం పై క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (ఆస్తి జప్తు) చట్టం కింద కాంపిటెంట్ అథారిటీ ఈ వేలాన్ని నిర్వహించిందని ఒక అధికారి తెలిపారు. వాటిలో రెండింటికి బిడ్‌లు రాలేదని, మిగిలిన వాటికి వరుసగా నాలుగు, మూడు బిడ్‌లు వచ్చాయని అధికారి తెలిపారు. “నేను ఇక్కడ తర్వాత పాఠశాలను ఏర్పాటు చేస్తాను. 2020లో కొనుగోలు చేసిన దావూద్ ఇబ్రహీం బంగ్లాలో సనాతన్ ధర్మ పాఠశాల స్థాపించాను” అని శ్రీవాస్తవ్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News