Saturday, December 21, 2024

సనాతన ధర్మం, శాస్త్రం ప్రామాణికంగానే పండుగ, పర్వదినాల గుర్తింపు

- Advertisement -
- Advertisement -
  • విద్వత్సభ అధ్యక్షుడు బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ

వర్గల్ : సనాతన దర్మం, శాస్త్రం ప్రామాణికంగానే పండుగ , పర్వదినాల గుర్తింపు ఉంటుందని జ్యోతిష్య విద్వత్సభ అధ్యక్షుడు బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ అన్నారు. ఆదివారం వర్గల్ విద్యాధిరి క్షేత్ర కంచి శంకరమఠంలో సభ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విద్వత్సభ సమాజానికే కాకుండా బావితరం పంచాంగ కర్తలకు మార్గదర్శ నం అవుతుందన్నారు. రాబోయే కొద్ది నామ సంవత్సర పండగ పర్వదినాలను సమగ్రంగా చర్చించి నిర్ణయించినట్లు తెలిపారు. వర్గల్ జ్యోతిష్య విద్వత్సభ నివేదికను ముఖ్యమంత్రి ప్రజా సంబందాల అధికారి జ్యాల నరసింహారావుకు అందజేసినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో పండితులు వెన్నంపల్లి జగన్మోహన శర్మ, సంపత్ కుమారాచార్యులు, కృష్ణమాచార్య సిద్దాంతి, సోమనాథ శర్మ సిద్దాంతి, మనోహర శర్మ సిద్దాంతి, కమలాకర్ శర్మ సిద్దాంతి, బాస్కరాచార్య సిద్దాంతి, శ్రీనాథ శర్మ సిద్దాంతి, రామారావు సిద్దాంతి, ప్రశాంతశర్మ సిద్దాంతి, ప్రవణాచార్య సిద్దాంతి, రాజేశ్వర్ శర్మ సిద్దాంతి, దత్తుమూర్తి సిద్దాంతి, వెంకటేశ్వర శర్మ సిద్దాంతి, నరేశ్ కులకర్ణి సిద్దాంతి, రామకృష్ణ శర్మ సిద్దాంతి, రాధాకృష్ణ శర్మ సిద్దాంతి, రవి శర్మ సిద్దాంతి, యోగేశ్వర సిద్దాంతి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News