Sunday, October 6, 2024

సనాతన ధర్మమే ఊతం.. దక్షిణాదిన కమలం వ్యూహం!

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ను మాటుమాయం చేసే ఆత్రుతలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బిజెపి బలోపేతం కావడానికి దోహదపడి ఫలితంగా తన పార్టీని బలహీనపరుచుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు సహకరించారు. ఇప్పుడిక బిజెపి తన బలాన్ని మరింత పెంచుకునే పనిలో పడింది తెలంగాణలో. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి కూడా వచ్చింది.

చంద్రబాబు నాయుడుకు భారతీయ జనతా పార్టీతో శాశ్వత మిత్రత్వం ఎప్పుడూ లేదు. అవసరాన్ని బట్టి ఆయన బిజెపితో కలుస్తుంటారు, విడిపోతుంటారు. ప్రస్తుతం ఆయన ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామిగా ఉండడం కూడా అంతవరకే. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన నాడు చేగువేరా భక్తుడు, తనది కమ్యూనిస్టు భావజాలం అని చెప్పుకున్నవాడు. ఒక దశలో బిజెపిని, ఆ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించినవాడు. తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీకి ఆయన అత్యంత సన్నిహితుడై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రియ శిష్యుడు అయిన విషయం తెలిసిందే. లడ్డూ వివాదం చంద్రబాబు నాయుడు లేవనెత్తగానే ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో పవన్ కళ్యాణ్ కాషాయాలు ధరించి సనాతన ధర్మ రక్షకుడిగా మారిపోయాడు.

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రతిపాదిస్తున్న వారాహి డిక్లరేషన్ ప్రకారం అది అమలు జరిగినట్టయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలను అంగీకరించి అట్లాంటి బోర్డుని ఏర్పాటు చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతుల్లోంచి వెళ్లిపోతుంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోయిన నాడే తమిళనాడు టిటిడి తమకు కావాలని డిమాండ్ చేసింది. అప్పటికి ఆ ముప్పు తప్పినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిపాదనల రూపంలో మరో ముప్పు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నట్టు కనిపిస్తున్నది.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో తన నూతన పార్టీ జన్‌సురాజ్ ప్రారంభించిన సందర్భంగా ఒక వార పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాతీ య రాజకీయాల మీద అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సరే తన రా ష్ట్రానికి సంబంధించిన నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్‌ల పని అయిపోతుందని చెప్తూనే ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రశాంత్ కిషోర్ చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా లేదా అనే విషయం రానున్న కొద్దిరోజుల్లో జరగనున్న ఎనిమిది తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల ఫలితా ల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఢి ల్లీ, బీహార్, బెంగాల్, తమిళనాడు, అసోం రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో భార తీయ జనతా పార్టీ కనుక మంచి ఫలితాలు సాధిస్తే కేంద్ర ప్రభుత్వానికి ఢోకా ఉండదని చెప్పారు ఆయన. అయితే ఈ రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి మంచి ఫలి తాలు సాధించగలదా అనేది కొంచెం అనుమానమే. ప్రస్తుతం ముగిసిన జ మ్మూకశ్మీర్, హర్యానా ఎన్నికల్లో బిజెపికి తీవ్రమైన ఎదురు దెబ్బలు తగలను న్నట్టు సర్వేలు చెప్తున్నాయి. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు బిజెపికి అంత ఆశాజనకంగా లేవన్నది అందరికీ తెలిసిన విషయం. ఎన్‌డిఎ కూటమికి నాలుగు వందల సీట్లు, బిజెపి సొంతంగా 300 సీట్లు లభిస్తాయని చెప్పుకున్న కమలనాథలకు 2024లో నిరాశే ఎదురైంది. దేశ ప్రజలు బిజెపిని 240 సీట్లకు పరిమితం చేశారు. వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారం లోకి వచ్చి అందులో 2019లో అత్యద్భుతమైన ఫలితాలు సాధించిన భారతీ య జనతా పార్టీ రానున్న రాష్ట్రాల ఎన్నికల్లో తమ పరిస్థితి ఏమిటో అర్థం చేసు కోకుండా పరిస్థితిని గురించి ఆలోచించకుండా ఉంటుందా. ఒకవేళ ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపికి ఎదురు దెబ్బ తగిలినట్టయితే కేంద్ర ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకోవడం కోసం వ్యూహాలు తప్పకుండా పన్నుతుంది.

నిజానికి ఈ 2024 ఎన్నికల్లోనే అట్లాంటి ఒక వ్యూ హాన్ని బిజెపి రచించింది. ఆ వ్యూహంలో భాగమే దక్షిణాది మీద తీవ్రమైన దృ ష్టి పెట్టడం. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిలో భారతీయ జ నతా పార్టీ నాయకులు మెరుగైన ఫలితాల కోసం ఎటువంటి ప్రయత్నం చేసా రో అందరూ చూశారు. ఫలితాలు కూడా కొద్దిగా మెరుగ్గానే కనిపించాయి. తెలంగాణ వంటి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది లోక్‌సభ స్థానా లను బిజెపి ఒంటరి పోటీలో దక్కించుకున్నది. 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్ స్వయంకృతా పరాధం కారణంగా బిజెపి ఈ స్థాయికి ఎదిగింది అనడంలో సందేహం లేదు. తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ను మాటుమాయం చేసే ఆత్రుతలో మా జీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బిజెపి బలోపేతం కావడానికి దోహదపడి ఫలితంగా తన పార్టీని బలహీనపరుచుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందు కు సహకరించారు. ఇప్పుడిక బిజెపి తన బలాన్ని మరింత పెంచుకునే పనిలో పడింది తెలంగాణలో. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి కూడా వచ్చింది. మరో దక్షిణాది రాష్ట్రం కర్ణాటక మిశ్రమ ఫలి తాలను ఇస్తున్నా సుదీర్ఘ కాలంగా వామపక్ష, ప్రజాస్వామ్య ఫ్రంట్ దిగ్విజ యంగా కొనసాగుతున్న కేరళ, ద్రవిడ రాజకీయాలకు పెట్టని కోట అయిన తమిళనాడు ఈ రెండు రాష్ట్రాలూ బిజెపికి కొరకరాని కొయ్యలుగా ఉన్నాయి.

కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో అక్కడి సుస్థిర ప్రభు త్వాలను గురించిన ఆలోచనలో బిజెపి నాయకత్వం పడినట్టుగా ఇటీవలి పరిణామాల వల్ల అర్ధం అవుతున్నది. కేరళలో మార్కిస్ట్ పార్టీలో అక్కడి ము ఖ్యమంత్రి సీనియర్ వామపక్ష నాయకుడు పినరయి విజయన్‌కి నిన్నమొన్నటి దాకా అత్యంత సన్నిహితుడు అయిన పార్టీ శాసన సభ్యుడు పివి అన్వర్ ఆయన మీద చేసిన తిరుగుబాటు వెనక ఎవరున్నా బిజెపి ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నది. తమ ముఖ్యమంత్రి విజయన్ ఆర్‌ఎస్‌ఎస్‌తో చేతులు కలిపారని అన్వర్ విమర్శిస్తున్నారు. ముస్లింలను అతిగా దగ్గరికి తీసినందుకే మొన్నటి లోక్‌సభ ఎన్నికలలో వామపక్ష ప్రజాస్వామ్య ఫ్రంట్ పరాజయం పాలైందని అంటూ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ లైన్‌ను మార్క్సిస్ట్ పార్టీ అంగీకరించింద ని అన్వర్ ఆరోపణ. దీనితో పాటు కేరళలో సిపిఎం అంతర్గత రాజకీయాలు కూడా అక్కడి అధికార పక్షంలో ముసలం పుట్టిందా అనే అభిప్రాయం కలిగి స్తున్నట్టు తెలుస్తున్నది. అయితే దక్షిణాదిలో బలం పెంచుకోవాలని అనుకుం టున్న బిజెపి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోదన్నది తెలియనిది కాదు.

తమిళనాడులో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నెట్ర కజగం (డిఎంకె) ముఖ్యమంత్రి స్టాలిన్ తన కుమారుడు, ప్రముఖ సినీ నటు డు ఉదయనిధి స్టాలిన్‌ను ఇటీవలే ఉపముఖ్యమంత్రిగా నియమించడంతో ఆస క్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉదయనిధి యువ రాజకీయ వేత్త మాత్రమే కాకుండా ప్రముఖ తమిళ నటుడు. హిందుత్వ రాజకీయాలకు వ్యతి రేకమైన డిఎంకె లైన్‌ను బలంగా ముందుకు తీసుకుపోయే క్రమంలో సనాతన ధర్మం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. దక్షిణాది ముఖచిత్రం ఇట్లా ఉన్న సమయంలో బిజెపి తన రాజకీయాలను ముందుకు తీసుకుపోవడానికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితి బాగా కలిసి వచ్చినట్టుంది.

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డ్డూ ప్రసాదానికి సంబంధించిన వివాదం అందరికీ తెలిసిందే. శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందని, లడ్డ్డూ కోసం వాడే నెయ్యిలో జంతువు కొవ్వు ఉందని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఒక పసలేని ప్రకటన అత్యంత వివాదాస్పదమై చివరికి సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కాదని మరింత ఉన్నత స్థాయి దర్యాప్తు కోసం సిబిఐ నేతృత్వంలో ఒక కమిటీని వేయడం గమనార్హం. చంద్రబాబు నాయుడు కేవలం గత ప్రభుత్వా న్ని, అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అప్రతిష్ఠ పాలు చేసే ఆలోచన తో ఆధారం లేని లడ్డూ కల్తీ వివాదాన్ని ముందుకు తెచ్చి కొరివితో తల గోక్కు న్నట్టున్నారు. ఇక్కడ వెనకటికి అత్యంత రాజభక్తి కలిగిన ఒక కోతి కథ గుర్తొస్తు న్నది. ఆ కోతి రాజభక్తిని మెచ్చిన రాజు దానికో మంచి కత్తి ఇచ్చి తన వ్యక్తిగత అంగరక్షకుడిగా నియమించుకున్నాడట. ఒకరోజు రాజు గాఢ నిద్రలో ఉన్నా డు. కాపలాగా ఉన్న కోతికి రాజు ముక్కు మీద ఒక ఈగ వాలడం కనిపించిం ది. నా రాజుకు నిద్రా భంగం చేస్తావా అని కోతి ఆగ్రహించి ఆ ఈగను చంప డానికి కత్తితో రాజు ముక్కు మీద కొట్టిందట. త

ర్వాతే ఏమైందో చెప్పాల్సిన అ వసరం లేదు కదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డూ వివాదం లేపగానే ఆయన ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో చేసిన పనులు రాజు కోతి కథను గుర్తుచేస్తున్నాయి. గత ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయాలనే దుగ్ధతో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన పని ఇప్పుడు టిటిడి ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వం చేతుల్లోంచి పోయే పరిస్థితి ఏర్పడింది. ఆయన డిప్యూటీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. ఇతర మతాల వలెనే హిందూ ధార్మిక సంస్థలన్నీటిని ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ఈ సనాతన బోర్డుకు అప్పగించాలని కూడా ఒక వాదన మొదలైంది.

చంద్రబాబు నాయుడుకు భారతీయ జనతా పార్టీతో శాశ్వత మిత్రత్వం ఎప్పుడూ లేదు. అవసరాన్ని బట్టి ఆయన బిజెపితో కలు స్తుంటారు, విడిపోతుంటారు. ప్రస్తుతం ఆయన ఎన్‌డిఎ కూటమిలో భాగస్వా మిగా ఉండడం కూడా అంతవరకే. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన నాడు చేగువేరా భక్తుడు, తనది కమ్యూనిస్టు భావజాలం అని చెప్పుకున్నవాడు. ఒక దశలో బిజెపిని, ఆ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమ ర్శించినవాడు. తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీకి ఆయన అత్యంత సన్నిహితుడై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రియ శిష్యుడు అయిన విషయం తెలిసిందే. లడ్డూ వివాదం చంద్రబాబు నాయుడు లేవనెత్తగానే ప్రాయశ్చిత్త దీ క్ష పేరుతో పవన్ కళ్యాణ్ కాషాయాలు ధరించి సనాతన ధర్మ రక్షకుడిగా మా రిపోయాడు.

11 రోజులు దీక్ష చేసి ఆపసోపాలు పడుతూ మెట్ల మార్గంలో తి రుమల చేరుకుని దేవుని దర్శించుకున్న తర్వాత తిరుపతి లో ఆయన వారాహి డిక్లరేషన్ పేరిట చేసిన ప్రకటన సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడి న మాటలు చర్చనీయాంశంగా మారినాయి. కొండ నాలికకు మందే స్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్టు తిరుమల లడ్డ్డూ ప్రసా దంలో కల్తీ జరిగిందని మాట్లాడబోయి చివరికి టిటిడిని పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందా అని చంద్రబాబు నాయు డు ఇప్పుడు బేంబేలు పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రతిపాదిస్తున్న వారా హి డిక్లరేషన్ ప్రకారం అది అమలు జరిగినట్టయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలను అంగీక రించి అట్లాంటి బోర్డుని ఏర్పాటు చేస్తే టిటిడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతుల్లోంచి వెళ్లిపోతుంది.

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడి పోయిన నాడే తమిళనాడు టిటిడి తమకు కావాలని చేసింది. అప్పటి కి ఆ ముప్పు తప్పినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిపాదనల రూపంలో మరో ముప్పు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నట్టు కనిపిస్తున్నది. చంద్రబాబునాయుడు ఎట్లా భారతీయ జనతా పార్టీని పూర్తిగా నమ్మడో భారతీయ జనతా పార్టీ కూడా ఆ యన్ని ఏనాడూ నమ్మదు. తమ పార్టీని స్వతంత్రంగా బలోపేతం చేసుకోవడా నికి బిజెపి పెద్దలు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు ఇప్పటి వరకు. ఒక దశలో తాను క్రిస్టియన్ అని, ముస్లింనని, కమ్యూనిస్టునని బహిరంగంగా ప్రక టించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంగ్లంలో ‘అన్ అపాలజిటి కల్లీ ఐయామ్ ఏ సనాతని హిందూ’ అని సిగాలు ఊగిపోవడం వెనక దక్షిణాదిలో తమకు ఒ క నాయకుడిని తయారు చేసుకోవాలన్న బిజెపి వ్యూహం ఉన్నదా అని పరిశీల కులు చర్చించుకుంటున్నారు.

పవన్ వారాహి డిక్లరేషన్ పేరిట తిరుపతిలో జరిపిన సభలో మాట్లాడిన మాటలు అటువంటి అభిప్రాయం కలి గించక మానవు. పేరు చెప్పి రాహుల్ గాంధీని, పేరు చెప్పకుండా ఉదయనిధి స్టాలిన్‌ని ఆయన దుయ్యబ ట్టారు. రాహుల్ గాంధీ అయోధ్యలో రామాలయ ఆవిష్కరణ సభను నాచ్‌గా నాతో పోల్చాడని, ఉదయనిధి స్టాలిన్ సనాతన ధ ర్మాన్ని వైరస్ తో పోల్చాడని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనల మీద తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయ నిధి స్టాలిన్‌ను వ్యాఖ్యానించమని జర్నలిస్టులు కోరగా ‘వెయిట్ అండ్ సీ’ అని వదిలేసారాయన. పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో కాసేపు తమిళంలో కూడా మాట్లాడిన వి షయం గమనించాలి. ఇంగ్లీష్‌లో మాట్లాడి రాహుల్ గాంధీకి, త మిళంలో మాట్లాడి ఉదయనిధి స్టాలిన్‌కి తన ఛాలెంజ్ తెలియ జేయాలనుకు న్నారేమో పవన్ కళ్యాణ్. అట్లా పవన్ తిరుపతిలో త్రిభాషా ప్రసంగం చేశారు.

పవన్ కళ్యాణ్ మంచి నటుడు, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్ప టివరకు అధికారం చవిచూడని ఒక సామాజిక వర్గానికి ప్రతినిధి. ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లేదా మరో రచయిత రాసి ఇస్తే డైలాగులు అద్భుతంగా చె ప్పగలడు. అట్లా రాసిచ్చింది చదవడం అనేది సినిమాల్లో పని కొస్తుంది గానీ ప్రజలను ఉ ద్దేశించి మాట్లాడేటప్పుడు కుదరదు. తిరుప తి సభలో పవన్ కళ్యాణ్ ఒక యోగి విష సర్పం కథ చెప్పుకొచ్చారు. పరమత సహ నం సరేగాని సనాతన ధర్మాన్ని దూషి స్తుంటే, వ్యతిరేకిస్తూ ఉంటే చూస్తూ ఊ రుకోం అని చెప్పడానికి ఉదాహరణగా ఆయన ఈ కథ చెప్పినట్టున్నారు. కథ ఏమిటంటే యోగి ఒక మఠానికి వెళ్లినప్పుడు అక్కడివాళ్లు ఒక విష సర్పం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్తారు. యోగి ఆ విష సర్పంతో మాట్లాడి అక్కడి వారిని కాటేయ వద్దని, ఇబ్బంది పెట్టవద్దని చెప్పి వెళ్ళిపోతా డు.

కొంత కాలానికి మళ్లీ యోగి అక్కడికి వెళ్లేసరికి సర్పం గాయాలతో పడి ఉంటుంది. నీ మాటలు విని ఎవరినీ గాయపరచనందుకు, కాటువేయనందు కు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి వాళ్లు నా మీద రాళ్ళేసి కొడుతున్నారు, కర్రల తో కొడుతున్నారు అని బాధపడుతూ చెప్పింది పాము. అప్పుడు యోగి నిన్ను కాటేయ వద్దన్నాను, కానీ బుసకొట్టి భయపెట్ట వద్దన్నానా అని చెప్పాడట. పవ న్ కళ్యాణ్ ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు విష సర్పాన్ని సనాతన ధర్మంతో పోల్చుతున్నారా? సమూహాలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే విషయాలపట్ల ప్రజలు ప్రభావితం కావాలని అనుకున్నప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది.

ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యా ఖ్యలు వాటికి ఉదయనిధి స్టాలిన్ స్పందన మీద మరో బిజెపి వీరాభిమాని సనాతన ధర్మ ప్రచారకర్త రిపబ్లిక్ టివి జర్నలిస్టు అర్నాబ్ గోస్వామి ఉదయని ధి స్టాలిన్ స్పందన సనాతన ధర్మాన్ని బెదిరించేదిగా ఉందని విపరీతార్థాలు తీశారు. ‘వెయిట్ అండ్ సి’ అంటే ‘ఆగే ఆగే క్యా హోతా హై దేఖో ’ (ముందు ముందు ఏం జరుగుతుందో చూస్తుండండి) అని అర్ధం. అది సనాతన ధర్మాన్ని బెదిరించడమే అని అర్నాబ్ వ్యాఖ్యానం. ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు అధికా రం చేపట్టేది ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన పనులు చేయడా నికి అని మరిచిపోయి సనాతన ధర్మం ఉద్దరణకు బయలుదేరడం విడ్డూరం. ఏదిఏమైనా తిరుమల లడ్డ్డూ వివాదం బిజెపికి లడ్డూలా దొరికినట్టుంది. దక్షి ణాదిన బలపడటం కోసం బిజెపి వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నట్టయితే సనాతన ధర్మ పరిరక్షణ సంగతి ఏమో కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడాల్సిందే.

దేవులపల్లి అమర్

డేట్‌లైన్ హైదరాబాద్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News