- Advertisement -
యాదాద్రి భువనగిరి: యాదాద్రి క్షేత్ర అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఈవో గీత తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటనలో ఆమె వివరాలు తెలియజేశారు. పవిత్రోత్సవాల సందర్భంగా 27, 28 తేదీల్లో నిత్య, శాశ్వత కల్యాణం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం, లక్షపుష్పార్చన, శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -