Thursday, January 23, 2025

40 కొత్త గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల నియోజకవర్గానికి 10కోట్ల నిధులతో 40 కొత్త గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేసినట్లు ఎంఎల్ఏ సంజయ్ కుమార్ తెలిపారు. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసమే నూతన గ్రామ పంచాయతీ భవనాలు ఏర్పాటు చేస్తున్నామని ఎంఎల్ఏ అన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ సంజయ్ కుమార్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిసి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని వారి కార్యాలయం లో కలిసి 40 నూతన గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు ప్రొసీడింగ్స్ ను  ఎంఎల్ఏ సంజయ్ కుమార్ ఇచ్చారు.

జగిత్యాల నియోజకవర్గం సంబంధించి కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు, శిథిలావస్త లో ఉన్న పాత గ్రామపంచాయతీ భవనాలకు మొత్తం 40 గ్రామ పంచాయతీలకు దాదాపు 10 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందనీ ఎంఎల్ఏ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు, ముఖ్యమంత్రి కెసిఆర్ లకు ఎంఎల్ఏ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నూతన గ్రామ పంచాయతీ భవనాలు ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం చాలా గొప్పగా ఉపయోగపడుతాయని,ఇది వరకు చిన్న గ్రామ పంచాయతీలకు నూతన గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు అయ్యాయని వాటిని ప్రారంభించుకున్నమని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News