Thursday, January 23, 2025

రాప్తాడులో ఇసుక దొరకదు… కానీ బెంగళూరులో దొరుకుతుంది: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైసిపి ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో ముంచేసిందని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. రాప్తాడు ప్రజాగళం ప్రచార యాత్రలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆఖరికి ఇసుకపైనా కూడా దోపిడీ చేశారని, భవన నిర్మాణ కార్మికులను నాశనం చేశారని, ఇసుక దొరక్క భవన నిర్మాణ రంగం కుదేలైందనన్నారు. రాప్తాడులో ఇసుక దొరకదు కానీ.. ఇక్కడి ఇసుక బెంగళూరులో దొరుకుతుందన్నారు. టిడిపి ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని, రాయలసీమకు రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టామమని వివరించారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లలో రూ. 2 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేదని విమర్శలు గుప్పించారు.

రాయలసీమకు జగన్ రాజకీయ హింస తీసుకరావడంతో రాయల సీమ ద్రోహిగా ముద్రపడ్డారని మండిపడ్డారు. అక్రమ కేసులు, బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని, జగన్‌ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని, విధ్యంసంతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచేశారని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, అన్నింటి ధరలను పెంచుకుంటూ పోయారని, అసమర్థుడు, అవినీతిపరుడిని ఇంటికి పంపాలని, మద్యం ధరలు కూడా విపరీతంగా పెంచేశారని, నాసిరకం మద్యంతో అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఎక్కువగా ఉందని చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. నాసిరకం మద్యం తాగి కొంతమంది చనిపోయారని, నిరుద్యోగులను నిలువునా ముంచేశారని, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News