Thursday, November 14, 2024

జోరుగా బకీట్‌ దందా..

- Advertisement -
- Advertisement -

మల్హర్: భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం మానేరు నదిలో ఏర్పాటు చేసిన మల్లారం గ్రామ ఇసుక క్వారీలో లారీల్లో పరిమితికి మించి ఇసుక లోడు చేసి బకీట్‌కు మూడు వేలు వసూల్‌తో జోరుగా బకీట్‌ దందా నడుస్తుంది. పరిమితికి మించి చేసిన సన్నంగా ఉన్న ఇసుకకు ప్రోక్‌లైన్ బకీట్‌కు రూ.3వేలు, దొడ్డరకం ఇసుకకు రూ. 1500 నిర్వహకులు తీసుకుంటున్నారు. దీంతో ఎలాంటి రుసుము చెల్లించకుండా తరలిపోతున్న ఇసుకలో ప్రభుత్వానికి రావల్సిన ఆదాయానికి గండి పడుతుంది.

క్వారీకి రోజుకు సుమారు 70 లారీలు వస్తుండడంతో లారీకి రెండు అధనపు బకీట్లు లోడు చేసి లారీకి రూ. 6 వేల చొప్పున సుమారు రోజుకు రూ. 4లక్షలు అక్రమంగా సొమ్ము చేసుకుంటూ నిర్వహకులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అధిక లోడుతో లారీలు రోడ్డు పై వెల్లడంతో మల్లారం నుండి కొయ్యూరుకు వెల్లే రోడ్డు గుంతలుగా మారి వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
వేబిడ్జిలో అక్రమాలు
లోడు చేసుకున్న ఇసుక లారీని వేబిడ్జితో కాంటా వేసినపుడు పరిమితికి మించి వచ్చిన లోడును తక్కువగా చూపిస్తూ రసీదు ఇస్తున్నట్లు తెలుస్తుంది. తక్కువ చూపి ఇస్తున్న రసీదులకు లారీ ఓనర్ల వద్ద వేబిడ్జి నిర్వహకులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇసుక లోడు ఎక్కువగా ఉన్న రసీదు సరిపోను ఉండడంతో ఎవరికి అనుమానం రాకుండా దందాను నడుపతున్నారు.
పట్టించుకోని అధికారులు
అధికలోడుతో ఇసుక లారీలు వెల్తున్న సంబందిత అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. క్వారీలో అధికారులు ఎలాంటి తనఖీలుచేయడంలేదు. నిబంధనలు ఉల్లంగించి నడుపుతన్న ఇసుక క్వారీలపై సంబదిత అధికారులైన రెవెన్యూ, ఆర్‌టిఒ, టిఎస్‌ఎండిసి, పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News