Sunday, December 22, 2024

నార్సింగిలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఇసుక లారీ బోల్తా

- Advertisement -
- Advertisement -

నార్సింగి: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఔటర్ రింగ్ రోడ్డు పై ఇసుక లారీ బోల్తా పడింది.  ఈ ప్రమాదం నుంచి లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుకు అడ్డంగా లారీ పడిపోవడంతో భారీగా టాఫ్రిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించారు. మితిమీరిన వేగంతో లారీ అదుపు తప్పి బోల్తాపడిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఓవర్ లోడ్ తో ఇసుక లారీలు తిరుగుతున్న రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని వాహనదారులు వాపోతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News