Wednesday, January 22, 2025

ఎఎస్ఐని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఇసుక మాఫియా

- Advertisement -
- Advertisement -

భోపాల్: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందు ఎఎస్ఐని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం శహ్ దోహ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భ్యోహరీ పోలీస్ స్టేషన్ లో మహేంద్ర బాగ్రీ అనే వ్యక్తి ఎఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. మహేంద్ర మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి ఓ కేసులో నిందితుడిని అరెస్టు చేయడానికి అర్థరాత్రి బయలు దేరారు. మార్గం మధ్యలో బధోలీ అనే గ్రామంలో ఇసుక ట్రాక్టర్ అడ్డుగా రావడంతో మహేంద్ర ఆ వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. ట్రాక్టర్ డ్రైవర్ వేగంగా వారిపైకి దూసుకెళ్లడంతో మహేంద్ర ఘటనా స్థలంలోనే చనిపోయాడు. వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు. ట్రాక్టర్ అక్కడి నుంచి 200 మీటర్ల దూరం ప్రయాణించి బోల్తాపడింది. పోలీసులు కేసు నమోదు చేసి ఎఎస్ఐ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో డ్రైవర్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ట్రాక్టర్ యజమాని మాత్రం పరారీలో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News