Monday, January 20, 2025

కర్నాటకలో దారుణం.. కానిస్టేబుల్‌పైకి ట్రాక్టర్ ఎక్కించి హత్య

- Advertisement -
- Advertisement -

కలబురిగి : అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకోవడమే ఆ కానిస్టేబుల్ పాపమైంది. ఇసుక తరలిస్తున్న వ్యక్తి తమను అడ్డుకుంటున్నారన్న కోపంతో ట్రాక్టర్‌ని ఏకంగా కానిస్టేబుల్‌పైకి ఎక్కించాడు. ఈ ఘటనలో పోలీస్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలబురిగి జిల్లా నిలోగి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మైసూర్ చౌహాన్(51) అనే కానిస్టేబుల్ దుండగుల దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయారు.

ఆయన అదే జిల్లాలోని అఫ్జల్‌పూర్ తాలుకా వాసి.జెవర్గీ తాలుకా నారాయణపూర్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకుని చౌహాన్ తోటి సిబ్బందితో కలిసి ఇసుక మైనింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. వారిని ప్రశ్నించగా ట్రాక్టర్ డ్రైవర్ విచక్షణ మరిచి చౌహాన్ మీది నుంచి ట్రాక్టర్ పోనించాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News