Thursday, January 23, 2025

దేశంలోనే ఇసుక విధానం అత్యుత్తమం : క్రిశాంక్ మన్నె

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అభ్యంతరం

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఇసుక తవ్వకాలపై ములుగులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్ మన్నె తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాహుల్ స్క్రిప్ట్ రీడర్‌గా మారి తెలంగాణలో ఇసుక విధానంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రూ. 39.66 కోట్ల ఆదాయాన్ని రూ.5,901.73 కోట్లకు పెంచిందని క్రిశాంక్ వెల్లడించారు. నిజా నిజాల్లోకి వెళ్లకుండా.. ముఖ్యమంత్రి కుటుంబంపై రాహుల్ యాదృచ్ఛికంగా ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే బిఆర్‌ఎస్ పాలనలో ఇసుక ఆదాయం 149 రెట్లు ఎందుకు పెరిగిందో రాహుల్ సమాధానం చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. 2015లో కొత్త ఇసుక మైనింగ్ విధానం ప్రవేశ పెట్టామని తెలిపారు. 2014 వరకు ఇసుక ద్వారా వచ్చే ఆదాయం రూ.39.66. కోట్లు.. ఇసుక ధర కూడా టన్నుకు 1500 కంటే ఎక్కువగా ఉంది. ఇసుక కొరత ఉండేదని గుర్తుచేశారు. కొత్త ఇసుక మైనింగ్ పాలసీని ప్రవేశపెట్టిన తర్వాత, ఇప్పటి వరకు రూ.5,901.73 కోట్లు ఆదాయం సమకూరిందన్నారు. కెసిఆర్ దార్శనికతతో అన్నింటినీ పారదర్శకంగా మార్చారని, ప్రజలు ఆన్‌లైన్ దరఖాస్తు విధానంతో ఇసుకను తీసుకునే వీలు కలిగిందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానం.. ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులతో పాటు, రాష్ట్ర ఇసుక మైనింగ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం, గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఏడు రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్ , జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాల ప్రతినిధులు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇసుక విధానాన్ని పరిశీలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News