Friday, November 22, 2024

39 ఏళ్ల తర్వాత చందనం దొంగ దొరికాడు

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: పోలీసులకు చిక్కకుండా గత 39 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఒక నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. నిందితుడు పరారీలో ఉండడం.. పోలీసులు ఆశలు వదిలేసుకోవడంతో మూతపడిపోయిన కేసు మళ్లీ తెరుచుకుంది. కర్నాటక సకిలేష్‌పూర్‌లోని కడూర్ కొండిగె గ్రామానికి చెందిన అబూబకర్(63) అనే వ్యక్తిని పోలీసులు ఇటీవలే అరెస్టు చేశారు. 39 ఏళ్ల క్రితం అతనిపై కర్నాటక అటవీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయాయి.

గంధపు చెక్కల స్మగ్లింగ్, వాహనాల చోరీ కేసులో ముదిగెరె తాలూకాలోని బలూర్‌లో అబూబకర్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా అతడికి జుడిషియల్ రిమాండ్ విధించారు. కర్నాటక అటవీ చట్టం, ఐపిసి సెక్షన్ల కింద 1985లో రానెబెన్నూర్‌లో అబూబకర్‌పై కేసు నమోదైంది. 1979లో మైసూరులోని వివి పురం పోలీసు స్టేషన్‌లో కూడా మరో కేసు నమోదైంది. అతడిని అరెస్టు చేసేందుకు వారెంట్ కూడా జారీ అయింది.

1984లో నమైదన కేసు ఇటీవలే కోర్టులో క్లోజ్ కూడా అయిందని డికె ఎస్‌పి విక్రమ్ అమతె తెలిపారు. కడబ పోలీసు ఎస్‌ఐ, ఆయనతోపాటు వారెంట్ టీమ్ కలసి ప్రత్యేక ప్రయత్నాలతో పాత నిందితుడు అబూబకర్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన చెప్పారు. మళ్లీ న్యాయప్రక్రియ పునఃప్రారంభించాల్సిన అవసరం ఉంటుందని ఆయన తెలిపారు. అబూబకర్ అరెస్టుకు కృషి చేసిన పోలీసు బృందానికి తగిన రివార్డు అందచేస్తామని ఆయన తలెఇపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News