Saturday, December 21, 2024

హైదరాబాద్‌ జూపార్క్‌లో గంధపు చెక్కల స్మగ్లింగ్ కలకలం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: పాతబస్తీలోని జూపార్క్‌లో గంధపు చెక్కల స్మగ్లింగ్ కలకలం రేపింది. ఈ నెల 20న జూపార్క్ లోని ఏడు గంధపు చెక్కలను స్మగ్లర్లు నరికివేశారు. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి జూపార్క్ బయట ప్రాంతంలో దాచి పెట్టిట్లు అధికారులు గుర్తించారు. జూపార్క్ ప్రహారీ గోడ చుట్టూ దాచిన గంధపు చెక్క దుంగలను జూపార్కు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం బహదూర్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News