Saturday, November 23, 2024

బ్రతుకు తెరువు కోసం వచ్చి.. కారేపల్లి ఘటనలో బలైనాడు

- Advertisement -
- Advertisement -

కారేపల్లి: చీమలపాడు దుర్ఘటనలో మృతి చెందిన వారంతా పేదవారే. మృతులలో ముగ్గురు కారేపల్లి మండల వాసులు కాగా, నాలుగవ మృతుడు నీరోడే సందీప్ మహారాష్ట్రకు చెందిన వాడు మృతుడు నిరోడే సందీప్ మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా, సిందేయి తాలుకా, మింగరి గ్రామానికి చెందిన వాడు బతుకు దెరువు కోసం 15 ఏండ్ల క్రితం పొట్ట చేత పట్టుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చాడు. సందీప్ కు తల్లిదండ్రులు, ఒక చెల్లి ఉంది. వీరి భారమంతా సందీపే చూసుకుంటున్నాడు. ఏడాదికి ఒకసారి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి, వారికి కావాల్సిన అవసరాలు తీర్చి, మళ్లి కూలి పనులకు వలస వెళ్తుంటాడు. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన క్రమంలో ఒరిస్సాకు చెందిన మమత అలియాస్ మమిన్ పరిచయం కావటంతో ఆమెను ఏడేళ్ల క్రితమే వివాహం చేసుకున్నాడు.

ఏడాది క్రితం భార్య మమత ,కొడుకు కృష్ణ లతో చీమలపాడు ప్రాంతానికి వచ్చిన సందీప్ సుతారి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అందరితో కలుపుగోలుగా ఉంటూ పనులు చేసే మృతుడు గ్రామంలో సభ జరుగుతుందని అటుగా వెళ్లాడు. ఈ క్రమంలో కాలుతున్న పూరి గుడిసెను ఆర్పే క్రమంలో బలయ్యాడు… చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు పంపించారు. హైదరాబాదులో చికిత్స పొందుతూ సందీప్ మృతి చెందాడు. కాగా తన జీవన సహచరుడిని కళ్ళేదుటే కోల్పోయిన మమత సందీప్ అంటూ తన కొడుకు కృష్ణను కౌగిలించుకొని హృదయ విదారకంగా రోదిస్తున్న తీరు, ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. తమలో ఒక్కడిగా ఉంటూ, అందరి తలలో నాలుకలా ఉండే, సందీప్ మరణంతో చీమలపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News