Sunday, April 6, 2025

తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజా బహదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి, అదనపు డిజి సందీప్ శాండిల్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 3వ తేదీన జరిగిన పోలీసు ఉన్నతాధికారుల బదిలీల ఉత్తర్వులను అనుసరించి అకాడమీ పూర్వ సంచాలకులు వివి శ్రీనివాసరావు నుండి ఆయన ఛార్జ్ తీసుకున్నారు. 1993 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ఇప్పటివరకు పలు హోదాలలో పనిచేశారు.

ఈ సందర్భంగా అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ బి నవీన్ కుమార్, డాక్టర్ జానకి షర్మిల, రావుల గిరిధర్, పిఎస్‌ఆర్ మూర్తి, టి రాధేష్ మురళి, రాఘవేందర్‌రెడ్డి, సుధీంద్ర, రాఘవరావు, అసిస్టెంట్ డైరెక్టర్లు కె.గంగారెడ్డి, పి.కృష్ణమూర్తి, రమణ, భూపాల్ తదితరులు ఆయనకు బొకే అందించి స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News