Tuesday, January 21, 2025

ధనుష్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా

- Advertisement -
- Advertisement -

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ యాక్టర్‌గా తన 50 మైల్ స్టోన్ మూవీ ’రాయన్’కి దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈనెల 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ నేపధ్యంలో హీరో సందీప్ కిషన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ధనుష్ అన్నతో కెప్టెన్ మిల్లర్, ఇప్పుడు రాయన్… బిగ్గర్ సెటప్ వున్న కాంబో ఫిలిమ్స్. రాయన్ సినిమాలో నా కాంట్రిబ్యుషన్ చాలా గ్రేట్‌గా వుంటుంది. ఇలాంటి క్యారెక్టర్ చాలా అరుదు.

ఇది నా కెరీర్‌లో గుర్తుండిపోయే క్యారెక్టర్. -ఈ సినిమాలో ధనుష్ పెద్దన్న, నేను రెండో వాడిని, మూడో వాడు కాళిదాస్, ఒక చెల్లి. ఇదే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ గురించే కథ. స్క్రీన్ ప్లే పరంగా చాలా కొత్తగా వుంటుంది. ప్రతి క్యారెక్టర్‌కి గుర్తింపు ఉంటుంది. -తీయడానికి చాలా టఫ్ ఫిల్మ్ ఇది. 90 రోజులు షూటింగ్, నేను 75 రోజులు చేశా. నాకొక టఫ్ షూటింగ్ ఎక్స్‌పీరియన్స్. ధనుష్ డైరెక్షన్‌లో చేయడం అరుదైన అవకాశంగా భావిస్తున్నాను. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. -ఇందులో మా ఇంటి పేరు రాయన్. కేజీఎఫ్, తిరు సినిమాలు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారో రాయన్‌ని కూడా అలానే ఎంజాయ్ చేస్తారు.

సినిమా చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలో ఫైట్స్ చాలా యూనిక్‌గా వుంటాయి. ప్రతి ఫైట్‌కి ఒక స్టొరీ వుంటుంది. పీటర్ మాస్టర్ అద్భుతంగా చేశారు. రెహ్మాన్‌తో పనిచేయడం – చాలా ఆనందంగా వుంది. నాకు చాలా మంచి సాంగ్ ఇచ్చారు. సినిమా రిలీజ్ తర్వాత ఆడియన్స్‌కి ఫేవరేట్ సాంగ్ అవుతుంది. అలాగే పీచు మిఠాయి, ఓ రాయన్ సాంగ్ కూడా నాకు చాలా నచ్చాయి. ఇక ప్రస్తుతం నక్కిన త్రినాధ రావుతో ఒక సినిమా చేస్తున్నా. ఇది నా 30వ సినిమా. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అలాగే మయావన్ సినిమా కూడా జరుగుతోంది. ఇది సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో టైప్ సినిమా. అలాగే రాహుల్, స్వరూప్‌తో వైబ్ చేస్తున్నాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News