Wednesday, January 22, 2025

డిఫరెంట్ ఫాంటసీ మూవీ..

- Advertisement -
- Advertisement -

సందీప్ కిషన్ హీరోగా వైవిధ్యమైన కధాంశాలతో సినిమాలని రూపొందించే విఐ ఆనంద్ దర్శకత్వంలో డిఫరెంట్ ఫాంటసీ మూవీ తెరకెక్కుతోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పణలో సందీప్ కిషన్ 28వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శనివారం సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌తో పాటు మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘ఊరు పేరు భైరవకోన’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఒక ఫాంటసీ ప్రపంచాన్ని చూపించారు. సందీప్ కిషన్ తన చేతిలో మంత్రదండంతో కనిపిస్తుండగా అతనికి సమీపంలో చంద్రుడు పెద్దగా కనిపిస్తూ మిగతా కట్టడాలు చిన్నవిగా కనిపించడం పర్ఫెక్ట్ ఫాంటసీ వరల్డ్‌ని కళ్ళముందు వుంచింది. ఈ పోస్టర్‌తో దర్శకుడు విఐ ఆనంద్ తన మార్క్ ని చూపించి ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తిని పెంచారు. మేకింగ్ వీడియో విజువల్స్ గ్రిప్పింగ్‌గా ఉన్నాయి. సందీప్ కిషన్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ఒంటినిండా మంటలతో ఓ వ్యక్తి నీళ్ళలోకి దూకుతున్న సీక్వెన్స్ టెర్రిఫిక్‌గా వుంది. మేకింగ్ వీడియోలో వినిపించిన నేపధ్య సంగీతం కూడా ఉత్కంఠని రేకెత్తించింది. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నారు.

Sandeep Kishan’s Ooru Peru Bhairavakona first look out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News