Monday, January 20, 2025

ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని పరిశీలించిన సందీప్ కుమార్ సుల్తానియా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సూర్యపేట జిల్లా నాగారం మండలంలోని ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురాతత్వ శాఖల ముఖ్య కార్యదర్శి, హెరిటేజ్ విభాగం సంచాలకులు సందీప్ కుమార్ సుల్తానియా ఆదివారం పురాతత్వ శాఖ సంరక్షణ అధికారులతో కలిసి సందర్శించారు. క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 400 సంవత్సరాల కాలమునకు చెందిన విశిష్ఠ భౌద్ద శిల్పాలు ఇక్కడ జరిపిన తవ్వకాలలో బయల్పడినవి. బౌద్ధారామం విశేషాలు గురించి అధికారులు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఇక్కడ బయల్పడిన 3 భౌద్ద శిల్పాలు.. తోరణాలను న్యూ యార్క్, సీయోల్ లలో జరిగే అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లలో ప్రదర్శించుటకు పంపినట్లు సందీప్ కుమార్ సుల్తానియా ఈ సందర్బంగా తెలిపారు.

బౌద్ధ చారిత్రక ఆధారాలు, ఆర్ట్ గురించి తెలియజేయుటకు ట్రీ అండ్ సెర్పెంట్ (Tree and Serpent ) పేరున ఈ ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కాగా యూఎస్‌ఏ లోని న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం లో ఈ నెల 17 నుండి నవంబర్ 13 వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. న్యూయార్క్ లో ఈ నెల 17 న జరిగే ఈ ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పర్యటన, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొననున్నారు. అలాగే దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో డిసెంబర్ 22 నుండి 2024 ఏప్రిల్ 14 వరకు ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శనల ద్వారా రాష్ట్రంలోని చారిత్రక బౌద్ధ ఆరామాలు, క్షేత్రాలకు విశ్వవ్యాప్త గుర్తింపు లభించనుంది. అలాగే పర్యటక రంగం అభివృద్ధికి తోడ్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News