Saturday, November 9, 2024

టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందీప్ మ‌ఖ్త‌లా

- Advertisement -
- Advertisement -

‘టీటా’ ది ప్రత్యేక ఒరవడి
ఐటీ ఉద్యోగులకు అండగా ‘టీటా’
రానున్న రోజుల్లో టీటాతో కలిసి వివిధ కార్యక్రమాలు
టీటా గ్లోబల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందీప్ మఖ్తల
ప్రమాణస్వీకారం చేయించిన
రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్

Sandeep Makhtala was elected Tita Global President

మనతెలంగాణ/హైదరాబాద్:  ఐటీ పరిశ్రమలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ప్రత్యేకతను కలిగి ఉందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ (ఐఏఎస్) ప్రశంసించారు. తన కెరీర్‌లో కొన్ని సంఘాల వ్యవహారశైలికి, టీటా విధానాలకు స్పష్టమైన తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందీప్ మఖ్తలచే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, టీటా అడ్వైజరీ కమిటీ చైర్మన్ జయేశ్ రంజన్ టిహబ్ వేదికగా ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్, రాఫ్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్ రావు తదితరులు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జయేశ్ రంజన్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు వివిధ రూపాల్లో తమ అభిప్రాయాలను వినిపిస్తాయని, కానీ టీటా మాత్రం ఐటీ ఉద్యోగులకు అండగా ఉండటమే కాకుండా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రత్యేకత చాటుకుందన్నారు. టీటా చేపట్టిన వివిధ కార్యక్రమాలకు వరుసగా మూడు సంవత్సరాల పాటు ఉత్తమ సంస్థ అవార్డును తెలంగాణ ప్రభుత్వం అందజేయడం టీటాను సందీప్ మఖ్తల నడిపించిన తీరుకు నిదర్శనమని ఆయన ప్రశంసించారు. రాబోయే కాలంలో టీటాతో కలిసి వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నామని, ప్రభుత్వం తరఫున టీటాకు పూర్తి సహకారం ఉంటుందని జయేశ్ రంజన్ వెల్లడించారు.

2023-, 26 సంవత్సరాలకు నూతన ప్రెసిడెంట్‌గా

2023-, 26 సంవత్సరాలకు గాను నూతన గ్లోబల్ ప్రెసిడెంట్ గా సందీప్ కుమార్ మఖ్తలను తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఎన్నుకుంది. మొత్తం ఏడు విభాగాల నుంచి వచ్చిన నామినేషన్లను పరిగణనలోకి తీసుకొని సందీప్ కుమార్ మఖ్తల ఎన్నిక ప్రకటిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అశ్విన్ చంద్ర వలబోజు తెలిపారు. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సందీప్ కుమార్ మఖ్తలను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అభినందించారు. మరోవైపు బతుకమ్మ సంబురాల్లో భాగంగా టిహబ్ వేదికగా అట్టహాసంగా పూలపండుగను టీటా నిర్వహించగా ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, గాయకుడు సుద్దాల తేజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News