Sunday, December 22, 2024

సందేశ్ ఖలి టిఎంసి కార్యకర్త అరెస్టు

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని సందేశ్ ఖలి ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు గాను ఓ టిఎంసి కార్యకర్తను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారానికి గురైన బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం నిందితుడు శుక్రవారం రాత్రి ఏదో విధంగా ఇంట్లోకి చొరబడి మైనర్ బాలికపై అత్యాచారం జరిపాడు.

కోల్‌కతాకు 100 కి.మీ దూరంలో సుందర్‌బన్స్ సరిహద్దుల్లో నదీతీర సందేశ్‌ఖాలీ ప్రాంతం ఉంది. ఇప్పుడు అరెస్టయిన టిఎంసి  నాయకుడు షాజహాన్ షేక్ , అతని మద్దతుదారులపై లైంగిక వేధింపులు, భూకబ్జా ఆరోపణలపై ఫిబ్రవరిలో నిరసనలు వెల్లువెత్తాయి.

8వ తరగతి చదువుతున్న ఆ బాలిక తర్వాత తప్పించుకోగలిగింది, సహాయం కోసం అరవడంతో కుటుంబ సభ్యులు, పొరుగువారు బయటకు వచ్చారని ఫిర్యాదును ఉటంకిస్తూ పోలీసులు తెలిపారు. దాదాపు 20 ఏళ్ల నిందితుడిని విచారిస్తున్నట్లు బసిర్‌హత్ పోలీస్ జిల్లా అధికారి తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామన్నారు.

దాదాపు 20 ఏళ్ల నిందితుడిని విచారిస్తున్నట్లు బసిర్‌హత్ పోలీస్ జిల్లా అధికారి తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News