Monday, December 23, 2024

సంధ్య కన్వెన్షన్ ఎండి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలీవుడు నటుడు అమితాబ్ బచ్చన్ బంధువును మోసం చేసిన కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్‌ రావును పోలీసులు అరెస్టు చేశారు. సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావును ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. అమితాబ్ బచ్చన్ బంధువు నుంచి శ్రీధర్ రూ.2.5 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వకపోవండంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. ట్రాక్టర్లు ఇప్పిస్తానని చెప్పి 2.5 కోట్లు అమితాబ్ బంధువుల నుంచి శ్రీధర్ రావు వసూలు చేశారు. గతంలో శ్రీధర్ రావు పలువురిని మోసం చేయడంతో నార్సింగ్, రాయదుర్గం, సనత్ నగర్ పోలీస్ స్టేషన్లలో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. గతంలో ఈవెంట్ మేనేజర్ పై శ్రీధర్ దాడి చేసిన దృశ్యాలు బయటకు రావడంతో అతడు కనిపించకుండా పారిపోయాడు. అరెస్టు కావడం బెయిల్ పై బయటకు రావడం అతడికి అలవాటుగా మారిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News