Wednesday, January 22, 2025

ఆ రోజు జరిగింది ఇది

- Advertisement -
- Advertisement -

అల్లు అర్జున్ రోడ్‌షోపై వీడియో విడుదల
చేసిన నగర కమిషనర్ సివి ఆనంద్
ముషీరాబాద్ నుంచి ఆర్‌టిసి క్రాస్‌రోడ్స్
వరకూ కారులో నిలబడి చేతులు ఊపుతూ
వచ్చిన అల్లు అర్జున్ హీరోను చూసేందుకు
ఎగబడిన జనం బౌన్సర్లతో థియేటర్‌లోకి
వెళ్లిన సినీనటుడు వెంటనే ముందుకు
దూసుకొచ్చిన అభిమానులు విరిగిపడిన
థియేటర్ బల్కానీ గేటు, తొక్కిసలాటలో
రేవతి, శ్రీతేజ్‌లకు గాయాలు అల్లు
అర్జున్‌కు నచ్చజెప్పి బయటకు పంపిన
పోలీసులు వీడియో స్పష్టంగా
కనిపించిన దృశ్యాలు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: సంధ్య థియేటర్ సంఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సంచలన వీడియోను బయటపెట్టారు. అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై వీడి యో చూస్తే కనీస జ్ఞానం ఉన్న వాళ్లకు ఏం జరిగిందో తెలుస్తుందని సిపి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఓ సంచలన వీడియో విడుదల చేశారు. ఘటన జరిగిన రోజు అసలు ఏం జరిగిం ది, పోలీసులు ఎలా వ్యవహారించారనే విషయాలతో కూ డిన వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉందని పోలీసులు చెబుతుండగా, మరోవైపు తాను ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహారించానని అల్లు అర్జున్ విలేకరులకు చెప్పాడు.

ఈ వి వాదం కొనసాగుతుండగానే హైదరాబాద్ నగర పోలీస్ క మిషనర్ సివి ఆనంద్ వీడియోను విడుదల చేశారు. ఘటన జరిగిన రోజు అసలు ఏం జరిగింది, పోలీసులు ఎలా వ్యవహరించారనే విషయాలతో కూడిన వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. పోలీసులు అల్లు అర్జున్‌కు ఓ మహిళ మృతి చెందిందనే విషయాన్ని తెలియజేశారని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించగా.. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. తనకు మహిళ చనిపోయిన విషయం మరుసటి రోజు తెలిసిందని చెప్పారు. ఈ విషయంపై పోలీసులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఆ రో జు విధుల్లో ఉన్న ఏసీపీ, డీసీపీతో కలిసి సిపి సివి ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. డిసెంబర్4 రాత్రి సంధ్య థియేటర్ సమీపంలోకి భారీగా ఫ్యాన్స్ తరలిరావడంతో తొక్కిసలాట జరిగిందని, ఆ సమయంలో థియేటర్ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు తెలిపా రు. ఘటన నేపథ్యంలో బాలుడికి పోలీసులు సిపి ఆర్ చేసి న తీరును వీడియోలో చూపించారు.

అలాగే అల్లు అర్జున్ అతడి మామ, కుమారుడు, అతడు రాకముందు థియేటర్ వద్ద ఉన్న పరిస్థితి వచ్చిన తర్వాత పరిస్థితిని వీడియోలు స్ప ష్టంగా చూపించారు. అల్లు అర్జున్ థియేటర్‌కు రాగానే గే ట్లు ఓపెన్ చేశారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు లోపలికి దూసుకుని రావడంతో అక్కడే ఉన్న రేవతి, ఆమె కు మారుడు శ్రీతేజ్ కిందపడిపోయారు. కుమారుడిని కాపాడి రేవతి తొక్కిసలాటలో మృతిచెందింది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు రేవతికి సిపిఆర్ చేశారు, ఇన్స్‌స్పెక్టర్ రాజు, ఎస్సై మౌనిక వారిని కాపాడుతూనే దూసుకు వచ్చే వారిని కంట్రోల్ చేశారు. తర్వాత రేవతిని, శ్రీతేజ్‌ను ఎసిపి రమేష్‌కుమార్, ఇన్స్‌స్పెక్టర్ కలిసి ఆస్పత్రికి తరలించారు. కేసు కు సంబంధించి విచారణ జరుగుతోందని హైకోర్టులో కేసు ఉండటంతో ఎక్కువ విషయాలు కేసు గురించి మాట్లాడలేమని సిపి తెలిపారు.న్యాయ పరమైన సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని సిపి సివి ఆనంద్ తెలిపారు.

సినిమా చూసిన తర్వాతే వెళ్తా అన్నాడు:ఎసిపి

డిసెంబర్4వ తేదీన సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ రావడంతో భారీగా అభిమానులు తరలివచ్చారని, థియేటర్ లో పలకు వెళ్లేందుకు, హీరోను చూసేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించడంతో తోపులాట జరిగిందని ఏసిపి రమేష్‌కుమార్ చెప్పారు. తోపులాటలో దురదృష్టవశాత్తు ఓ మహిళ మృతి చెందిందని, ఓ బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనే వి షయాన్ని అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్‌కు చెప్పామన్నా రు.

అల్లు అర్జున్‌కు ఈ విషయం చెప్పేందుకు ప్రయత్నించగా థియేటర్ యాజమాన్యం, మేనేజర్ అంగీకరించలేదని, తాము సమాచారం చేరవేస్తామని చెప్పి చేరవేయలేదన్నారు. కొద్ది సేపటి తర్వాత వారిని పక్కకు తప్పించి నేరుగా వెళ్లి మహిళ మృతిచెందిందని, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, రూ ట్ క్లియర్ చేశామని చెప్పానని, కాని సినిమా చూసిన త ర్వాతే వెళ్తానని చెప్పాడని తెలిపారు. దీంతో తాను ఈ విష యం అక్కడు ఉన్న సెంట్రల్ జోన్ డిసిపి అక్షాంష్ యాదవ్‌కు చెప్పానని తెలిపారు. డిసిపి వెంటనే థియేటర్‌లోకి వ చ్చి అల్లు అర్జున్‌ను వెళ్లిపోవాలని ఆదేశించారని, చెప్పిన త ర్వాత 10 నుంచి 15 నిమిషాల సమయం ఇచ్చామన్నారు.

ముందే రావద్దని చెప్పా: సిఐ

సంధ్య థియేటర్ యాజమాన్యం తనకు అనుమతి కోసం ఉత్తరం రాసిందని, దానికి అనుమతి ఇవ్వలేమని ముందుగానే చెప్పామని చిక్కడపల్లి ఇన్స్‌స్పెక్టర్ రాజు నాయక్ తెలిపారు. బెనిఫిట్ షో సమయంలో పోలీసులం అందరం అక్కడే ఉన్నామని, తన వద్ద ఉన్న థియేటర్ యాజమాన్యానికి అల్లు అర్జున్ రావద్దని, అభిమానులను ఆపలేమని ముందుగానే చెప్పామని తెలిపారు. అయినా వినకుండా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారని, తొక్కిసలాటలో తాను కూడా కిందపడిపోయానని తెలిపారు. ఘటనను తన ముందే జరగడంతో 15 రోజుల నుంచి బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ప్రయత్నించినా రేవతి ప్రాణాన్ని కాపాడలేకపోయినట్లు తెలిపారు. ఆ బాధను మాటల్లో చెప్పలేనని, బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

తాటాతీస్తాం

బౌన్సర్లకు కమిషనర్ వార్నింగ్
బౌన్సర్ల ఆగడాలు ఎక్కువయ్యాయని, హద్దు మీరితే తాట తీస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ హెచ్చరించారు. ఇటీవల కాలంలో బౌన్సర్ల ఆగడాలు ఎక్కువయ్యాయని, సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనలో బౌన్సర్లు పోలీసులను నెట్టివేశారని తెలిపారు. ఇక నుంచి పోలీసులపై చేయి వేస్తే లోపలేస్తామని హెచ్చరించారు. ఎలాంటి సంఘటన లు జరిగినా వారిని ఏర్పాటు చేసుకున్న విఐపిలు, ఏ జెన్సీలు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. బౌన్స ర్లు బందోబస్తులో ఉన్న పోలీసులను నెట్టివేసుకుం టూ వెళ్తున్నారన్నారు. పోలీసులు, ప్రజలపై చేయి వే సినా, ముట్టుకున్నావారిని వదిలిపెట్టమని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News