Wednesday, January 1, 2025

థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయి:సంధ్య థియేటర్ యాజమాన్యం

- Advertisement -
- Advertisement -

సంధ్య థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని యాజమాన్యం పోలీసులకు పంపించిన లేఖలో పేర్కొన్నారు. డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేటర్‌లో నిర్వహించిన పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతిచెందగా, ఆమె కూరుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాటపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ ఎందుకు మూసివేయకూడదని యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. దీనికి స్పందించిన యాజమాన్యం తన న్యాయవాదుల ద్వారా ఆరు పేజీల ఉత్తరం పంపించారు. సంధ్య థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని, తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు థియేటర్ యాజమాన్యం సమాధానం పంపింది.

గత 45 ఏళ్లుగా థియేటర్ రన్ చేస్తున్నామని, గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ షోకు 80 మంది థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. డిసెంబర్ 4, 5న థియేటర్ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుందని తెలిపారు. సినిమాల విడుదల సందర్భంగా గతంలోనూ సినిమా హీరోలు థియేటర్‌కు వచ్చారని తెలిపారు. సంధ్య థియేటర్‌లో కార్లు, బైక్‌లకు ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం ఉందని తెలిపారు. ఈ మేరకు 6 పేజీల లేఖను సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు పంపింది. బాధిత కుటుంబానికి ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ రూ.50లక్షలు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ.25లక్షలు సాయం అందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News